ETV Bharat / bharat

చెన్నై టూ చైనా: 'మోదీ- జిన్​పింగ్​ చర్చలు ఫలప్రదం' - జాతీయ వార్తలు

భారత్, చైనా దేశాధినేతల మధ్య చెన్నై వేదికగా జరిగిన రెండో అనధికార శిఖరాగ్ర సదస్సు ఫలవంతంగా ముగిసింది. భారత్​-చైనా సంబంధాలను పునర్నిర్మించుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్​ నిర్ణయించారు. ఈ భేటీలో కశ్మీర్​ అంశంపై ఎలాంటి ప్రస్తావన రాలేదని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది.

modi xi second informal meet
author img

By

Published : Oct 12, 2019, 5:02 PM IST

Updated : Oct 12, 2019, 6:40 PM IST

'మోదీ- జిన్​పింగ్​ చర్చలు ఫలప్రదం'

భారత్​-చైనా మధ్య సంబంధాలను పునర్నిర్మించుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్​ నిర్ణయించారు. తమిళనాడు వేదికగా జరిగిన రెండో అనధికారిక శిఖరాగ్ర సదస్సులో రెండో రోజు కోవలంలో ఇద్దరు దేశాధినేతలు సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిపారు. భవిష్యత్తులోనూ అనధికారిక చర్చలు కొనసాగాలని ఇరువురు నేతలు ఆకాంక్షించారు.

కొత్త అధ్యాయం

ఈ భేటీతో చైనా-భారత్​ మధ్య సంబంధాల విషయంలో కొత్త అధ్యాయం మొదలు కానుందని ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. వుహాన్​ సదస్సు స్ఫూర్తితో చెన్నై వేదికగా జరిగిన ఈ భేటీతో పరస్పరం విశ్వాసం పెరిగిందని తెలిపారు.

ఏకాంత సమావేశం తర్వాత ఇరువురు నేతలు సముద్రతీరంలో కలియతిరిగారు. అనంతరం ఇరు దేశాల ప్రతినిధుల స్థాయి చర్చల్లో మోదీ-జిన్​పింగ్​ పాల్గొన్నారు. ఈ భేటీకి విదేశాంగ మంత్రి జయ్​శంకర్​, జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్​, విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్​ గోఖలే హాజరయ్యారు.

పూర్వం నుంచి చెన్నై టూ చైనా..

తమిళనాడుతో చైనాకు పూర్వం నుంచే సాంస్కృతిక, వాణిజ్య సంబంధాలు ఉన్నాయని ప్రధాని గుర్తు చేశారు. 2 వేల ఏళ్ల క్రితమే భారత్‌, చైనా ఆర్థికంగా శక్తిమంతమైన దేశాలుగా ప్రస్థానం సాగించాయని చెప్పారు. చర్చలు ఫలవంతంగా సాగాయని మోదీ ట్వీట్​ చేశారు.

modi xi second informal meet
ప్రధాని ట్వీట్

"రెండో అనధికారిక సదస్సు కోసం భారత్​కు వచ్చిన జిన్​పింగ్​కు కృతజ్ఞతలు. భారత్, చైనా సంబంధాలకు చెన్నై సదస్సు ఊతం ఇవ్వనుంది. ఇది మన దేశంతో పాటు ప్రపంచానికి లబ్ధి చేకూర్చుతుంది."

-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

చర్చల అనంతరం మోదీ-జిన్​పింగ్ కలిసి భోజనం చేశారు. ఈ భేటీ సందర్భంగా భారత్​ ఇచ్చిన ఆతిథ్యం ఎప్పటికీ గుర్తుండిపోతుందని జిన్​పింగ్​ అన్నారు. రెండు దేశాల మధ్య సైనిక సహకారం పెరగాలని ఆకాంక్షించారు. సదస్సు పూర్తయ్యాక తమిళనాడు నుంచి చైనా బయలుదేరారు జిన్​పింగ్​.

విదేశాంగ శాఖ ప్రకటన...

వివాదాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని ఇరు దేశాధినేతలు నిర్ణయించినట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్​ గోఖలే తెలిపారు. ప్రధాని మోదీ లేవనెత్తిన అంశాలకు జిన్​పింగ్ సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు.

"వుహాన్​ సదస్సు తర్వాత ఇరుదేశాల సంబంధాల్లో స్థిరత్వం వచ్చిందని, బలోపేతం అయ్యాయని మోదీ-జిన్​పింగ్​ ఏకాభిప్రాయం వ్యక్తంచేశారు. వాణిజ్య లోటును పూడ్చేందుకు సుస్థిర చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ఒక కొత్త యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇతర సేవలకు సంబంధించి వీరు చర్చిస్తారు. ఇందుకు చైనా నుంచి ఉప ప్రధాని హూ చుంచ్వా, భారత్​ నుంచి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ ప్రాతినిధ్యం వహిస్తారు. చైనాలో ఐటీ, ఫార్మా రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు భారతీయ సంస్థలను ఆహ్వానించారు జిన్​పింగ్."

-విజయ్​ గోఖలే, విదేశాంగ శాఖ కార్యదర్శి

చర్చకు రాని కశ్మీర్​

మోదీ-జిన్​పింగ్​ భేటీలో కశ్మీర్​కు సంబంధించి ఎలాంటి చర్చ జరగలేదని గోఖలే స్పష్టం చేశారు. ఐసిస్​ లాంటి అంతర్జాతీయ సమస్యలు ప్రస్తావనకు వచ్చినా సుదీర్ఘ చర్చ జరగలేదని వివరించారు.

"జమ్ముకశ్మీర్‌ అంశం ఈ భేటీలో ప్రస్తావనకు రాలేదు. చర్చ జరగలేదు కాబట్టి ఈ అంశంపై మరో ప్రశ్నకు తావులేదు. కశ్మీర్‌ అంశం తమ అంతర్గత విషయమని భారత్‌ ఇదివరకే తన వైఖరి స్పష్టం చేసింది."

-విజయ్​ గోఖలే, విదేశాంగ శాఖ కార్యదర్శి

ఇదీ చూడండి: చారిత్రక కట్టడాల నడుమ మోదీ-జిన్​పింగ్​ స్నేహగీతిక

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Hamamatsu, Central Japan – 12 October 2019
1. Wide pan of rough sea and coastal area under heavy rains
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Fujisawa, Kanagawa Prefecture – 12 October 2019
2. Various of part of a jetty   
STORYLINE:
Heavy waves bashed the shore in the city of Hamamatsu on Saturday as Japan stood by for a powerful typhoon, forecast as the worst in six decades.
Typhoon Hagibis, which means "speed" in Filipino, was advancing north-northwestward with maximum sustained winds of 162 kilometres (100 miles) per hour, according to the Japan Meteorological Agency.
It was expected to make landfall near Tokyo later Saturday and then pass out to sea eastward.
In the port of Fujisawa, Kanagawa Prefecture, west of Tokyo, a part of a jetty lay bobbing in rough waters.
Evacuation advisories have been issued for risk areas, including Shimoda city, west of Tokyo.
Dozens of evacuation centres were opening in coastal towns.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 12, 2019, 6:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.