రెండో రోజు భారత పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు చైనా అధ్యక్షుడు జిన్పింగ్. తమిళనాడు కోవలం గ్రామంలోని 'తాజ్ రిసార్ట్ ఫిషర్మ్యాన్స్ కోవ్' హోటల్ ఇందుకు వేదికైంది.
ఇరు దేశాలకు సంబంధించిన వాణిజ్య లోటు, ఆర్థిక అంశాలపై చర్చలు జరిపారు మోదీ, జిన్పింగ్. ప్రాంతీయ సహకారం, అంతర్జాతీయ సమస్యలపైనా ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. ప్రస్తుతం ఇరు దేశాల ఉన్నతాధికారులతో అగ్రనేతల సమావేశం మొదలైంది.
తొలిరోజు తమిళ సంప్రదాయ దుస్తుల్లో జిన్పింగ్తో సమావేశమైన మోదీ... రెండో రోజు మాత్రం ఎప్పటిలాగే లాల్చి, పైజామా, జాకెట్ ధరించారు.
ఇదీ చూడండి:- ఇకపై సౌదీ సాయుధ దళాల్లోనూ నారీశక్తి సేవలు