ETV Bharat / bharat

అభివృద్ధి మంత్రం- కాశీలో మోదీ విజయనాదం

author img

By

Published : May 23, 2019, 3:55 PM IST

Updated : May 23, 2019, 6:50 PM IST

అభివృద్ధి మంత్రం వారణాసిలో మరోసారి నరేంద్రుడికి తిరుగులేని విజయాన్ని కట్టబెట్టింది. భావోద్వేగ ప్రసంగాలు మోదీని కాశీవాసులకు మరింత చేరువ చేశాయి. ఆధ్యాత్మిక రాజధాని 'నమో' నామస్మరణతో మార్మోగిపోయింది.

మోదీ గెలుపు
కాశీలో మోదీ విజయభేరి

"వారణాసిని అభివృద్ధి చేయాలన్న కాశీ విశ్వనాథుడి ఆకాంక్షలు నెరవేర్చేందుకే ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నా" అన్న నరేంద్ర మోదీ ప్రచారానికి కాశీ ప్రజలు మరోసారి పట్టం కట్టారు. అఖండ విజయాన్ని అందించారు. వారణాసి అభివృద్ధి జరగాలంటే మోదీ రావాలన్న అభిప్రాయం ప్రజల్లో నాటుకుపోయిందనడానికి ఆయనకు వచ్చిన మెజార్టీయే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధానమంత్రి అభ్యర్థిగా పోటీ చేస్తుండటం, ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు కనీస పోటీని ఇవ్వకపోవడం వల్ల నరేంద్ర మోదీ విజయం సునాయాసమైంది.

2014లో అలా.. ఇప్పుడిలా

"నాకు నేనుగా ఇక్కడికి రాలేదు. పవిత్ర గంగా మాత పిలుపు మేరకే వచ్చా".... 2014 ఎన్నికల ప్రచారంలో మోదీ వ్యాఖ్యలివి. ఆ మాటలు అప్పుడు బ్రహ్మాస్త్రంగా పని చేశాయి. ఆయన చేసిన భావోద్వేగపూరిత ప్రసంగాలు ఆఖండ విజయాన్ని కట్టబెట్టాయి.

ఈ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో కాశీ విశ్వనాథుడిని ప్రస్తావించి వారణాసి ఓటర్ల మదిని గెలుచుకున్నారు మోదీ. కాశీని అభివృద్ధి చేసేందుకే మీ ముందుకొచ్చానంటూ ఇచ్చిన హామీలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి.

భాజపా కంచుకోట.. కానీ 2004లో..

వారణాసిలో ఓటర్ల సంఖ్య 17లక్షలకు పైనే. సంప్రదాయంగానూ భాజపాకు పట్టున్న ప్రాంతమిది. 2004లో మినహా 1991 నుంచి వరుసగా భాజపా అభ్యర్థులే విజయం సాధిస్తూ వచ్చారు. మోదీకి ముందు భాజపా సీనియర్‌ నేత మురళీ మనోహర్‌ జోషి ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు.

హిందువుల ఆధ్యాత్మిక నగరంగా పేరొందినా.. ముస్లిం జనాభా కూడా కాశీలో ఎక్కువే. అయినప్పటికీ సాక్షాత్తు ప్రధాని అభ్యర్థే పోటీకి దిగడం వల్ల ఎన్నిక ఏకపక్షమైంది. మోదీపై వ్యతిరేకత పెద్దగా లేకపోయినప్పటికీ.. ఉన్న వ్యతిరేక ఓట్లు కాస్తా మహాకూటమి అభ్యర్థి శాలినీ యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థి అజయ్‌ రాయ్‌ మధ్య చీలిపోయాయి. మోదీ గెలుపు సునాయాసమైంది.

కారణాలివే..

వారణాసిలో మోదీ అఖండ విజయానికి అనేక కారణాలు. వాటిలో ప్రధానమైనవి ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి, ప్రజల్లో ఆయనపై పెరిగిన అపార నమ్మకం.

మోదీకి కలిసొచ్చిన అభివృద్ధి పనులు

  • ఐదేళ్లలో సుమారు రూ.3వేల కోట్లు విలువైన 39 ప్రాజెక్టులు ప్రారంభించడం.
  • గంగా నది ప్రక్షాళన, అంతర్గత రహదారుల అభివృద్ధి , భూగర్భ విద్యుత్తు తీగల పనులు పూర్తిచేయడం
  • మౌలిక సదుపాయాలతో అనుసంధానం పెంపు వంటి చర్యలు
  • గంగానదీ తీరాన ఉన్న స్నాన ఘట్టాలను పరిశుభ్రం చేసేందుకు నిధుల సమీకరణలో భాగంగా ప్రధానిగా తనకు వచ్చిన కానుకలను వేలం వేయడం
  • వీధులలో ఎల్​ఈడీ దీపాలను అమర్చడం
  • పారిశుద్ధ్యం మెరుగుదల పనులు, హోమీబాబా క్యాన్సర్‌ ఆసుపత్రి ప్రారంభం
  • వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆరంభించడం
  • పైవంతెనల నిర్మాణం, వారణాసి నుంచి లఖ్‌నవూ వరకు 4 వరుసల జాతీయ రహదారి ఏర్పాటు
  • పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడగడం వంటి చర్యలు ప్రజలను ఆకర్షించాయి.

ఆలయ అభివృద్ధి

కాశీ విశ్వేశ్వరుడికి విశాల ప్రాంగణాన్ని సమకూర్చే బృహత్తర ప్రణాళికకు శ్రీకారం చుట్టారు ప్రధాని మోదీ. రూ.600 కోట్లతో.. 25వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో మణికర్ణిక ఘాట్‌ నుంచి నేరుగా విశ్వేశ్వరుడి సందర్శనకు వెళ్లేందుకు వీలుగా నడవా నిర్మాణం చేపట్టారు. ఇవన్నీ మోదీకి సానుకూలంగా పని చేసి వారణాసి లోక్​సభలో తిరుగులేని విజయాన్ని కట్టబెట్టాయి.

ప్రభావం చూపని విమర్శలు

పురాతన నగరాభివృద్ధి పేరుతో ఇళ్లు, భూముల్ని స్వాధీనం చేసుకుంటున్నారనే విమర్శలు, సౌకర్యాల మెరుగుదల పనుల్ని ప్రైవేటువారికి లాభం చేకూర్చేలా చేపడుతున్నారనే ఆరోపణలు వినిపించినా అవేవీ ఓటర్లను ప్రభావితం చేయలేకపోయాయి. మోదీకి ప్రతికూలంగా మారలేకపోయాయి.

ఫలించిన సమీక్షలు

ఎన్నికలకు పార్టీ శ్రేణులను సరైన రీతిలో సన్నద్ధం చేయడం కూడా మోదీ విజయానికి దోహద పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. జిల్లా, డివిజన్, నియోజకవర్గ స్థాయి శ్రేణులతో సమీక్షలు నిర్వహిస్తూ ఎన్నికలకు సమాయత్తం చేశారు. 2014 తరహాలో వార్‌ రూమ్‌ ఏర్పాటు చేసుకుని ఎన్నికల్లో గెలుపొందడానికి కావాల్సిన వ్యూహారచన చేయడం కమలదళానికి కలిసి వచ్చింది.

ఇదీ చూడండి:

మోదీ బ్లాక్​బస్టర్​ ముందు కాంగ్రెస్​ అట్టర్​ఫ్లాప్

RESTRICTION SUMMARY: DO NOT OBSCURE LOGO
SHOTLIST:
STEFANO MICELI, BLOGGER WEBSITE ROMA PULITA! – DO NOT OBSCURE LOGO
Rome -  22 May 2019
1. Various of man lying on cornice as fire burns through building  
2. Firefighters arriving, pan to man on cornice
3. Various of man lying on cornice as firefighters use water hose to put out fire
4. Fire engine
5. Various of building and man on cornice
6. Fire engine
7. Pan from man to firefighter arriving at balcony
8. Various of firefighters rescuing man
STORYLINE:
A young man was forced to escape from his room and seek safety on a cornice when a fire ripped through his building in Rome on Wednesday.
He could be seen holding on for his life on the cornice, and was lying dangerously close to flames billowing out from the building's windows.
Crowds gathered below to watch as firefighters worked to remove him.
He was eventually lifted out by a crane and although shaken, he escaped without any injuries.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : May 23, 2019, 6:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.