సార్వత్రిక ఎన్నికల వేళ.. ప్రధాని నరేంద్ర మోదీ ఓటర్లను చైతన్యవంతం చేయడానికి వినూత్న ప్రయత్నం చేశారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు కృషి చేయాలని వివిధ రంగాల ప్రముఖులకు విజ్ఞప్తి చేస్తున్నారు. సామాజిక మాధ్యమం ట్విట్టర్లో వరుస ట్వీట్లు చేశారు. ఇందులో రాజకీయ, పారిశ్రామిక, సినీ ప్రముఖులు, క్రీడాకారులు, సంఘ సేవకులు సైతం ఉన్నారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ పోలింగ్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు మోదీ. బాధ్యతాయుతమైన పౌరులుగా ఇది అందరి కర్తవ్యమని గుర్తు చేశారు.
-
My fellow Indians,
— Narendra Modi (@narendramodi) March 13, 2019
Urging you all to strengthen voter awareness efforts across India.
Let us all ensure maximum number of Indians come out to vote in the 2019 Lok Sabha elections.
మీరూ కలిసి రావాలి..!
ముఖ్యంగా రాజకీయ ప్రత్యర్థులైన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీలను సైతం ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.
-
I appeal to @RahulGandhi, @MamataOfficial, @PawarSpeaks, @Mayawati, @yadavakhilesh, @yadavtejashwi and @mkstalin to encourage increased voter participation in the upcoming Lok Sabha polls. A high turnout augurs well for our democratic fabric.
— Narendra Modi (@narendramodi) March 13, 2019
భాజపా అనుకూల, ప్రతికూల పార్టీల నాయకులను పేరు పేరునా విజ్ఞప్తి చేశారు. వీరిలో భాజపా వ్యతిరేక పార్టీ నేతలైన మాయావతి, అఖిలేష్ యాదవ్, శరద్ పవార్, స్టాలిన్, తేజస్వి యాదవ్ తదితరులున్నారు. అలాగే భాజపా మిత్రపక్ష నేతలైన నితీశ్‌కుమార్ (బిహార్), పాసవాన్, పవన్ చామ్లింగ్ తదితరులను కోరారు.
-
I call upon KCR Garu, @Naveen_Odisha, @hd_kumaraswamy, @ncbn and @ysjagan to work towards bringing maximum Indians to the polling booths in the upcoming elections. May voter awareness efforts be strengthened across the length and breadth of India.
— Narendra Modi (@narendramodi) March 13, 2019
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఒడిశా, కర్ణాటక ముఖ్యమంత్రులు నవీన్ పట్నాయక్, కుమార స్వామి, ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌లను ఓటర్ చైతన్య కార్యక్రమంలో కీలక పాత్ర పోషించాలని కోరారు.
మీరే చైతన్యం కలిగించాలి...!
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగం ఎంత ఆవశ్యకమో ప్రజలకు తెలియపర్చడానికి కృషి చేయాలని వివిధ రంగాల ప్రముఖులకు మోదీ విజ్ఞప్తి చేశారు.
వీరిలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు రతన్‌టాటా, ఆనంద్ మహీంద్రా, కళారంగం నుంచి నటులు షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే, నాగార్జున (తెలుగు), మోహన్‌లాల్ (మలయాళం), క్రీడారంగం నుంచి సచిన్, యోగేశ్వర్ దత్, సుశీల్ (రెజ్లింగ్), పీవీ సింధు, సైనా, కిదాంబి శ్రీకాంత్ ( బ్యాడ్మింటన్), పాత్రికేయులు తదితర రంగాల ప్రముఖులు ఉన్నారు.
-
Dear @RNTata2000, @anandmahindra and @ashishchauhan,
— Narendra Modi (@narendramodi) March 13, 2019
India wins when our democracy gets strengthened.
Ensuring maximum participation in voting is the perfect way to strengthen democracy.
Can we all make this happen?
-
Dear @srikidambi, @Pvsindhu1 & @NSaina,
— Narendra Modi (@narendramodi) March 13, 2019
The core of badminton is the court and the core of democracy is the vote.
Just like you smash records, do also inspire a record-breaking voter turnout. I request you to increase voter awareness & motivate youth to vote in large numbers.
-
Dear @k_satyarthi, @thekiranbedi and @sudarsansand,
— Narendra Modi (@narendramodi) March 13, 2019
A vote gives voice to people's aspirations.
As widely respected personalities, your efforts towards increasing voter awareness will strengthen India's democracy.
I request you to lend your voice for the same.
-
Dear @Mohanlal and @iamnagarjuna,
— Narendra Modi (@narendramodi) March 13, 2019
Your performances have entertained millions over the years and you have also won many awards. I request you to create greater voter awareness and urge people to vote in large numbers.
The award here is, a vibrant democracy.