మంగళవారం మధ్యప్రదేశ్‌లో ఎన్నికల శంఖారావం పూరించిన ప్రధాని మోదీ... నేడు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. కర్ణాటకలోని కలబురగి, తమిళనాడులోని కంచీపురం ప్రాంతాల్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.
బెంగళూరులోని ఆదాయ పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ టెర్మినల్‌ను జాతికి అంకితమిస్తారు. అనంతరం కలబురగిలో ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారులతో ప్రధాని సంభాషిస్తారని ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటన జారీ చేసింది.
కంచీపురంలో పలు రోడ్డు, రైలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు ప్రధాని. వీటితో పాటు కంచీపురం నుంచే చెన్నైలోని జానకి మహిళా కళాశాలలోని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎమ్జే రామచంద్రన్ విగ్రహాన్ని వీడియో లింక్ ద్వారా ఆవిష్కరిస్తారు.