ETV Bharat / bharat

నేడు మూడు నగరాలకు మోదీ-టీకాపై సమీక్ష

author img

By

Published : Nov 28, 2020, 5:24 AM IST

Updated : Nov 28, 2020, 9:29 AM IST

భారత్​లో కరోనా టీకాను అభివృద్ధి చేస్తోన్న భారత్ బయోటెక్, సీరం, జైడస్ క్యాడిలా సంస్థలను నేడు సందర్శించనున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఇందుకోసం ఆయన ఒకే రోజు పుణె, అహ్మదాబాద్, హైదరాబాద్​లో పర్యటించనున్నారు.

Modi visit
మోదీ మూడునగరాల పర్యటన నేడే

కొవిడ్-19 కోరల నుంచి విముక్తి కల్పించే టీకా కోసం దేశమంతా ఆశగా ఎదురుచూస్తోన్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం కీలక పర్యటనలు చేపట్టనున్నారు. భారత్​లో కరోనా టీకాను అభివృద్ధి చేస్తోన్న భారత్ బయోటెక్, సీరం, జైడస్ క్యాడిలా సంస్థలను నేడు సందర్శించనున్నారు. ఇందుకోసం ఆయన ఒకే రోజు పుణె, అహ్మదాబాద్, హైదరాబాద్​లో పర్యటించనున్నారు. వ్యాక్సిన్ అభివృద్ధి, ఉత్పత్తి, పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లను ఆయన స్వయంగా సమీక్షించనున్నారు. మోదీ పర్యటన వివరాలను ప్రధాని కార్యాలయం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. పర్యటన సందర్భంగా వ్యాక్సిన్​కు సంబంధించి మోదీ కీలక ప్రకటన చేస్తారని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మొదట జైడస్..

ప్రధాని మొదట గుజరాత్​లోని జైడస్​ క్యాడిలా కర్మాగారాన్ని సందర్శిస్తారు. జైడస్ క్యాడిలా సంస్థ అభివృద్ధి చేస్తున్న 'జైకోవ్-డి' టీకా ప్రస్తుతం రెండో దశ ప్రయోగాల్లో ఉంది. అహ్మదాబాద్​కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంగోదర్​ పారిశ్రామిక ప్రాంతానికి శనివారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో చేరుకుంటారు.

భారత్​ బయోటెక్​కు...

శనివారం మధ్యాహ్నం హైదరాబాద్​లోని హకీంపేట వైమానికి స్థావరానికి ప్రత్యేక విమానంలో చేరుకుంటారు. అక్కడి నుంచి నగర శివార్లలోని జినోమ్ వ్యాలీలో గల భారత్​ బయోటెక్ సంస్థకు వెళ్తారు. ఈ సంస్థ 'కొవాగ్జిన్' పేరుతో టీకాను అభివృద్ధి చేస్తోంది. మూడో దశ క్లనికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. మోదీ ఆ సంస్థలో కరోనా టీకా అభివృద్ధి, ఉత్పత్తిని పరిశీలించి పురోగతి పనులను సమీక్షిస్తారు. భారత్ బయోటెక్ యాజమాన్యం, శాస్త్రవేత్తలతో మాట్లాడతారు. అక్కడాయన సుమారు గంటసేపు గడుపుతారు.

సీరం సందర్శన..

పుణె పర్యటనలో భాగంగా... అస్ట్రాజెనెకా, ఆక్స్​ఫర్డ్​తో కలిసి సీరం సంస్థ అభివృద్ధి చేస్తోన్న 'కొవిషీల్డ్'​ వ్యాక్సిన్​కు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుంటారు. టీకా ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది, పంపిణీకి సంబంధించిన ఏర్పాట్ల గురించి ఆరా తీస్తారు. అనంతరం మోదీ దిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు.

సీరం సంస్థ తయారు చేస్తున్న ఈ టీకా రెండు దశల ప్రయోగాలు పూర్తయ్యాయి.

ఇదీ చదవండి:'నివర్' తుపాను బాధితులకు ప్రధాని సాయం

Last Updated : Nov 28, 2020, 9:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.