ETV Bharat / bharat

డిసెంబర్​ 25న రైతులతో మాట్లాడనున్న మోదీ - రైతు సంస్కరణలు

డిసెంబర్​ 25న రైతులను ఉద్దేశించి వర్చువల్​ విధానంలో మాట్లాడనున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్ర వైఖరిని రైతులకు స్పష్టం చేయనున్నారు. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

Modi to release PM-KISAN instalment to 9 crore farmers on Dec 25
25న అక్కడి రైతులతో మాట్లాడనున్న మోదీ
author img

By

Published : Dec 24, 2020, 5:31 AM IST

మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. డిసెంబరు 25న రైతులను ఉద్దేశించి వర్చువల్‌ విధానంలో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ఆయన నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్ర వైఖరిని రైతులకు స్పష్టం చేయనున్నారు. ఈ మేరకు బుధవారం.. ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన వెలువరించింది.

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథక నిధులు రూ. 18వేల కోట్ల రూపాయలను విడుదల చేయనున్నారు. దీనితో దాదాపు 9 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలగనుంది. ఈ సమావేశంలో ఆరు రాష్ట్రాల నుంచి ఎంపిక చేసిన రైతులు ప్రభుత్వ పథకాల ద్వారా వారు పొందిన లాభాల గురించి మాట్లాడతారని ఆ ప్రకటనలో వెల్లడించారు. ఈ సమావేశం జరిగిన తర్వాత నూతన వ్యవసాయ చట్టాలపై రైతులకున్న అపోహలు తొలగిపోతాయని ఆశిస్తున్నామన్నారు.

ఇదీ చూడండి: 'సంస్కరణలు ఇంకా చాలా ఉన్నాయ్​- చర్చలకు రండి'

ప్రభుత్వం సిద్ధం..

ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ రాసిన లేఖను రైతులంతా చదవాలని ప్రధాని కోరారు. గతవారం మధ్యప్రదేశ్‌లో జరిగిన సమావేశంలో రైతులతో ప్రతి అంశాన్ని కూలంకుషంగా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ప్రతిపక్షాలు రైతులను పెడదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు.

పీఎం కిసాన్..

పీఎం- కిసాన్ పథకంలో భాగంగా అర్హత కలిగిన లబ్ధిదారు రైతులకు ప్రతీ సంవత్సరం రూ. 6 వేలు అందిస్తోంది కేంద్రం. ఈ మొత్తాన్ని 4 నెలలకు ఒకసారి చొప్పున మూడు సమాన కిస్తీలలో 2 వేల రూపాయల వంతున చెల్లిస్తున్నారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేస్తారు.

ఇదీ చూడండి: 'రైతు సంక్షేమంతోనే ఆహార భద్రత'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.