దిల్లీలోని భాజపా ప్రధాన కార్యాలయంలో ప్రధాని నరేంద్రమోదీ.... కేంద్రమంత్రులు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో సమావేశమయ్యారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరే ముందు ఈ ఐదేళ్లు దేశ ప్రజలకు సేవచేసినందుకుగాను మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు.
"నేను ఎన్నో ఎన్నికలను చూశాను కానీ ఇది రాజకీయాలకు అతీతమైనది. ప్రజలే పోరాడుతున్నారు. నేను చాలా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం నిర్వహించాను. కానీ ఈ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించినపుడు తీర్థయాత్రలు చేసినట్లు అనిపించింది."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
ఈ వ్యాఖ్యలను మోదీనే స్వయంగా చెప్పినట్లు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ విలేకరులతో పేర్కొన్నారు.
భాజపా అధ్యక్షుడు అమిత్‌షా అధ్యక్షతన ఈ భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన తీరు, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు, 23న ఓట్ల లెక్కింపు సమయంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, అరుణ్‌జైట్లీ, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, ప్రకాశ్ జావడేకర్ సహా ఎన్డీఏ భాగస్వామ్య పక్షనేతలు నేతలు సమావేశంలో పాల్గొన్నారు. మోదీకి పూలమాల వేసి, శాలువాతో సత్కరించారు. మోదీ సర్కార్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు అమిత్ షా. ఐదేళ్లలో ఎన్నో ఘనతలు సాధించారని కొనియాడారు.
-
I congratulate Team Modi Sarkar for their hard work and remarkable achievements in the last 5 years.
— Chowkidar Amit Shah (@AmitShah) May 21, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Let us keep this momentum going for a New India under the leadership of PM @narendramodi.
Sharing pictures of Aabhar Milan of Union Council of Ministers at BJP HQ, New Delhi. pic.twitter.com/X2sgvJjJ5c
">I congratulate Team Modi Sarkar for their hard work and remarkable achievements in the last 5 years.
— Chowkidar Amit Shah (@AmitShah) May 21, 2019
Let us keep this momentum going for a New India under the leadership of PM @narendramodi.
Sharing pictures of Aabhar Milan of Union Council of Ministers at BJP HQ, New Delhi. pic.twitter.com/X2sgvJjJ5cI congratulate Team Modi Sarkar for their hard work and remarkable achievements in the last 5 years.
— Chowkidar Amit Shah (@AmitShah) May 21, 2019
Let us keep this momentum going for a New India under the leadership of PM @narendramodi.
Sharing pictures of Aabhar Milan of Union Council of Ministers at BJP HQ, New Delhi. pic.twitter.com/X2sgvJjJ5c
సమావేశం అనంతరం హోటల్ అశోకాలో ఎన్డీఏ నేతలకు అమిత్‌షా విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు భాజపా మిత్రపక్ష నేతలు నితీశ్‌కుమార్, ఉద్ధవ్ ఠాక్రే, రామ్‌విలాస్ పాసవాన్ సహా ఎన్డీఏ ప్రముఖ నాయకులు హాజరయ్యారు.
ఇదీ చూడండి: ఓటమిని వినమ్రంగా స్వీకరించండి: భాజపా