ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ చేరుకున్నారు. అహ్మదాబాద్ విమానాశ్రయంలో మోదీకి.. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ స్వాగతం పలికారు.
అనంతరం తన తల్లిని కలవడానికి గాంధీనగర్లోని ఆమె నివాసానికి వెళ్లారు మోదీ. తల్లి వద్ద ఆశీర్వాదాలు తీసుకున్నారు. కొడుకును చూసి మురిసిపోయిన హీరాబెన్.. మోదీకి ఆప్యాయంగా మిఠాయిలు తినిపించారు.
గురువారం సర్దార్ వల్లభభాయ్ జయంతి సందర్భంగా గుజరాత్లో పర్యటిస్తున్నారు మోదీ. రేపు ఐక్యతా విగ్రహాన్ని సందర్శించిన అనంతరం.. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.