కాంగ్రెస్ అధికారంలో ఉండగా కొందరి చేతుల్లోనే రిమోట్ కంట్రోల్ ఉండేదని విమర్శించారు ప్రధాని నరేంద్రమోదీ. ఉత్తరప్రదేశ్ హర్దోయిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ... మహాకూటమిపై విరుచుకుపడ్డారు. ఎస్పీ, బీఎస్పీపైనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
"2014 ముందు కీలు బొమ్మ ప్రభుత్వం ఉండేది. అప్పుడు రెండు మొబైల్ ఫోన్ తయారీ కంపెనీలు ఉండేవి. ఇప్పుడు కేవలం ఐదేళ్లలో 125పైగా కర్మాగారాలు ఫోన్లు తయారు చేస్తున్నాయి. 2016 ఏప్రిల్ 14న బాబాసాహెబ్ అంబేడ్కర్ జన్మదినం సందర్భంగా నవభారతంలో నూతన వ్యవస్థకు శ్రీకారం చుట్టాం. అంబేడ్కర్ పేరు మీద 'భీమ్ యాప్'ను విడుదల చేశాం. "
-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
ఇదీ చూడండి: 'అవకాశవాదుల పొత్తు చిత్తవడం ఖాయం'