గోవా దివంగత ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ప్రజల మనిషి అని ప్రధాని నరేంద్రమోదీ కితాబిచ్చారు. ఆయన మరణం తీరని లోటని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గోవాలోని పనాజీలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు మోదీ. అదే వేదికగా కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మోదీ. రక్షణ రంగంలో భారీ అవినీతికి కాంగ్రెస్ పాల్పడిందని ఆరోపించారు.
"పార్టీ పనుల కోసం గోవాకు ఎన్నో సార్లు వచ్చా. కానీ ఈ సారి మనోహర్ పారికర్ మన మధ్య లేరు. ఆయన లేరన్న సత్యాన్ని స్వీకరించాల్సిందే. రక్షణ శాఖను కాంగ్రెస్ భ్రష్టు పట్టించింది. రక్షణ ఒప్పందాలతో ఆడుకుంది. బోఫోర్స్‌లో ముడుపులు తీసుకుంది. ఖత్రోచి విషయంలోనూ అంతే. ఈ పరిణామాలతోనే దశాబ్దాలుగా సైనికులకు ఆధునిక ఆయుధాలు అందలేదు. తండ్రి చేసిన బోఫోర్స్ పాపం రాహుల్‌గాంధీకి భారంగా మారింది. దాన్ని తొలగించుకునేందుకు ప్రపంచంలో అందరి మీద ఆరోపణలు చేస్తున్నారు."
-నరేంద్రమోదీ, ప్రధాన మంత్రి
ఇదీ చూడండి: శాసనసభ ఎన్నికలకు సర్వం సిద్ధం