ETV Bharat / bharat

కరోనాపై గెలిచిన హైదరాబాదీకి మోదీ ఫోన్​ - Covid-19 latest updates

దేశంలో కరోనా కట్టడికి కఠిన నిర్ణయాలు తీసుకోవడం తప్పలేదని చెప్పారు ప్రధాని. అయితే ఈ నిర్ణయాలతో కష్టపడుతున్న ప్రజలు, ముఖ్యంగా పేదలు తనను క్షమించాలన్నారు. వైరస్​ను జయించిన వారు, చికిత్స అందిస్తున్న వైద్యులతో 'మనసులో మాట' కార్యక్రమం ద్వారా మాట్లాడిన మోదీ.. వారి అనుభవాలు దేశానికి స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు.

MODI ON CORONA VIRUS IN MANN KI BAAT
మిమల్ని కష్టపెట్టినందుకు క్షమించండి: మోదీ
author img

By

Published : Mar 29, 2020, 11:28 AM IST

వైరస్​పై పోరులో.. కఠిన నిర్ణయాలతో కష్టపడ్డ దేశప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్షమాపణలు తెలిపారు. ముఖ్యంగా పేదలు తనను మన్నించాలని కోరారు. అయితే.. కరోనా వైరస్​తో పోరును చావు-బతుకుల పోరాటంగా అభివర్ణించిన మోదీ.. కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పలేదని స్పష్టం చేశారు.

'మనసులో మాట' కార్యక్రమం ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు మోదీ. వైరస్​ను తొలినాళ్లల్లోనే అరికట్టాల్సిన ఆవ్యశ్యకత ఉందన్నారు. ఇందుకు భారతీయులు ఎంతో కృషి చేస్తున్నారని ప్రశంసించారు.

'భయపడాల్సిన అవసరం లేదు..'

కరోనా నుంచి కోలుకున్న ఓ హైదరాబాద్​ వాసితో మోదీ సంభాషించారు. తనకు వైరస్​ సోకినట్టు తెలిసిన తర్వాత.. కొంత భయపడ్డానని, కానీ వైద్యులు తనలో ధైర్యాన్ని నింపారని తెలిపారు ఆ వ్యక్తి. భయపడాల్సిన అవసరం లేదని.. కోలుకునే అవకాశాలే ఎక్కువని హైదరాబాద్​వాసి ధీమాగా చెప్పారు.

తన అనుభవాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలని ఆ హైదరాబాద్​వాసిని మోదీ కోరారు. ఇది వైరల్​ అయితే.. ప్రజల్లో అవగాహనతో పాటు ధైర్యం కూడా పెరుగుతుందన్నారు.

ఇదీ చూడండి:- ఆపరేషన్​ కరోనా: ఇరాన్​ నుంచి భారత్​కు మరో 275 మంది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.