ETV Bharat / bharat

అలాంటి వారి తాట తీయండి: మోదీ - మోదీ

కశ్మీర్​ ప్రజలపై జరుగుతున్న దాడుల్ని సమర్థంగా అణచివేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించారు.

కశ్మీరీలపై దాడుల్ని ఆపాలని రాష్ట్ర ప్రభుత్వాలకు మోదీ సూచన
author img

By

Published : Mar 8, 2019, 5:55 PM IST

దేశంలోని వివిధ ప్రాంతాల్లో కశ్మీర్​ ప్రజలపై జరుగుతున్న దాడుల్ని సమర్థంగా అణచివేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. లఖ్​నవూలో ఇటీవల జరిగిన దాడులను అల్లరిమూకల పనిగా అభివర్ణించారు. దేశ సమగ్రతను కాపాడటం అత్యవసరమని పేర్కొన్నారు మోదీ.

ఉత్తరప్రదేశ్​లోని కాన్పూర్​లో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.

వైమానిక దాడులపై విపక్షాల ఆరోపణలతో పాక్​కు లాభమన్న మోదీ

"వీరుల త్యాగాల కారణంగా దేశం సురక్షితంగా ఉంది. అభివృద్ధి వైపు దూసుకెళ్తోంది. కానీ కొంతమందికి ఇది దుఃఖం కలిగిస్తోంది. సైన్యం పరాక్రమాన్ని తగ్గించి చూపేందుకు రాత్రి పగలూ అనే భేదం లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. పాకిస్థాన్​కు సంతోషం కలిగించే వ్యాఖ్యల్ని చేస్తున్న వారిని క్షమించొచ్చా.. ఇది సైన్యానికి, వీరుల పరాక్రమానికి అవమానం కాదా? రాజకీయ స్వార్థం కోసం విపక్షాలు చేస్తున్న వ్యాఖ్యల వల్ల వారు ఉపయోగిస్తున్న భాష కారణంగా పాకిస్థాన్​కు బలం చేకూరుతోంది."-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

Varanasi (UP), Mar 08 (ANI): Prime Minister Narendra Modi on Friday laid the foundation stone of Kashi Vishwanath Temple Corridor in Varanasi. Uttar Pradesh Chief Minister Yogi Adityanath, UP Governor Ram Naik and state BJP president Mahendra Nath Pandey was also present during the event.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.