ETV Bharat / bharat

'5 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం' - సమావేశం

ఆర్థిక శాఖ సహా ఇతర ముఖ్య శాఖల కార్యదర్శులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమావేశమయ్యారు. భవిష్యత్తు ప్రణాళికలతో పాటు జులై 5న ప్రవేశపెట్టే బడ్జెట్​ అంశాలపై చర్చించినట్టు సమాచారం.

'5 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం'
author img

By

Published : Jun 19, 2019, 7:25 AM IST

Updated : Jun 19, 2019, 8:19 AM IST

ప్రభుత్వంలోని కీలక శాఖల కార్యదర్శులతో ప్రధాని నరేంద్రమోదీ భేటీ అయ్యారు. జులై 5న ప్రవేశ పెట్టే వార్షిక బడ్జెట్​, ఆర్థిక వ్యవస్థ బలోపేతం, నూతన ఉద్యోగాల సృష్టిపై చర్చించారు. ఈ అంశాల్లో రాబోయే 100 రోజుల్లో ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలపై సమాలోచనలు చేశారు.

ప్రధాని అధికారిక నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఆర్థిక శాఖలోని ఐదుగురు కార్యదర్శులు సహా ప్రధాన శాఖల కార్యదర్శులు, నీతి ఆయోగ్​ ముఖ్య అధికారులు పాల్గొన్నారు.

రూ. 350 లక్షల కోట్ల(5 ట్రిలియన్ల) ఆర్థిక వ్యవస్థగా భారత్​ను మార్చేందుకు రానున్న ఐదేళ్లలో చేపట్టాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారని సమాచారం. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం, పీఎం-కిసాన్ పథకం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, కుళాయి ద్వారా అందరికీ మంచినీరు, అందరికీ విద్యుత్ పథకాలూ చర్చకు వచ్చాయి.

వ్యవసాయ రంగంలో నెలకొన్న సమస్యలపై నిర్మాణాత్మక మార్పులు చేపట్టాలని నీతిఆయోగ్ పాలకమండలి భేటీ సందర్భంగా వ్యాఖ్యానించారు మోదీ. తద్వారా వ్యవసాయ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను పెంచాలన్నారు. పంట సాగుకు సౌకర్యాలను పెంచి, మద్దతు ధరను అందించాలని ఆకాంక్షించారు.

అన్ని రంగాలను బలోపేతం చేసే దిశగా

సులభతర వాణిజ్య విధానాల ద్వారా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రతి శాఖలో చేపట్టాల్సిన మార్పులు, విధానాలపై మోదీ చర్చించారని సమాచారం. 6.8 గా నమోదై ఐదేళ్ల కనిష్ఠానికి పడిపోయిన జీడీపీ వృద్ధి రేటును మెరుగుపరచడం, రెవెన్యూ వసూళ్ల పెంపునకు చేపట్టాల్సిన చర్యలపై సమాలోచనలు చేశారని అధికార వర్గాలు తెలిపాయి.

ద్రవ్యోల్బణం ఆర్​బీఐ ఆహ్వానించదగిన స్థాయిలోనే ఉన్నప్పటికీ 2019 జనవరి-మార్చి త్రైమాసిక ఆర్థిక వృద్ధి 5.8 గా నమోదై ఐదేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. వ్యవసాయం, ఉత్పత్తి రంగాల్లో వృద్ధి తక్కువగా నమోదవడమే దీనికి కారణం. ఈ నేపథ్యంలోనే జులై 5న ప్రవేశపెట్టనున్న బడ్జెట్​లో ఆయా రంగాలకు చేయాల్సిన కేటాయింపులపై మోదీ ఆరా తీశారు.

ఇదీ చూడండి: జమిలి ఎన్నికలపై నేడు అఖిలపక్ష భేటీ

RESTRICTION SUMMARY: HUNTINGTON PARK POLICE DEPARTMENT - MUST CREDIT
SHOTLIST:
HANDOUT - HUNTINGTON PARK POLICE DEPARTMENT, MUST CREDIT
Huntington Park, California  - June 2019
1. Various, police robot patrolling city park
STORYLINE:
A Southern California police force is welcoming a robot to the department.
Huntington Park police say "HP RoboCop" will provide 360-degree high-definition video footage. It'll become an official member of the force at a Tuesday evening ceremony.
The department says the blue-and-white rolling robot serves as an extra set of eyes for areas such as parks and buildings that police might not have time to patrol.
HP RoboCop has been helping patrol a park in the Los Angeles suburb for several weeks since it was previewed at a 5k run last month.
HP RoboCop even has its own Twitter page.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jun 19, 2019, 8:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.