ETV Bharat / bharat

'ఆరోగ్య వసతులను విస్తరించడం ఎంతో ముఖ్యం' - కరోనా వైరస్​ ఇండియా

Modi meets cm's amid corona virus outbreak in India
ముఖ్యమంత్రులతో మోదీ సమావేశం
author img

By

Published : Jun 17, 2020, 3:28 PM IST

Updated : Jun 17, 2020, 4:20 PM IST

16:01 June 17

ఇదే ముఖ్యం...

కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో... ఆరోగ్య మౌలిక వసతులను విస్తరించుకోవడం ఎంతో ముఖ్యమని మోదీ ఉద్ఘాటించారు. ప్రతి కరోనా రోగికి సరైన చికిత్స అందించినప్పుడే ఇది జరుగుతుందన్నారు. ఇందుకోసం పరీక్షలు, బాధితులను గుర్తించి ఐసోలేషన్​ చేయడంపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు.

15:54 June 17

పీపీఈ కిట్లు...

మూడు నెలల ముందు.. ప్రపంచ దేశాలతో పాటు భారత్​లోనూ పీపీఈ కిట్ల కొరత ఉందని తెలిపారు మోదీ. అయితే ఇప్పుడు రాష్ట్రాల్లో కోటికిపైగా పీపీఈ కిట్లు, ఎన్​ 95 మాస్కులు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. 

15:42 June 17

యాక్టివ్​ కేసులు..

దేశంలో.. యాక్టివ్​ కేసుల కన్నా వైరస్​ నుంచి కోలుకున్న బాధితుల సంఖ్యే ఎక్కువగా ఉందని మోదీ తెలిపారు. ముఖ్యమంత్రులతో జరుగుతున్న భేటీలో ఈ వ్యాఖ్యలు చేశారు. వెంటిలేటర్లు, ఐసీయూలో చికిత్స అవసరమున్న బాధితులు కూడా తక్కువగా ఉన్నారని పేర్కొన్నారు మోదీ. సకాలంలో తీసుకున్న నిర్ణయాల వల్లే దేశంలో కరోనాను కట్టడి చేయగలిగామని పునరుద్ఘాటించారు.

15:35 June 17

అమర వీరులకు నివాళి

  • Delhi: PM Narendra Modi, Union Home Minister Amit Shah and the chief ministers of 15 states and union territories, who are present in the meeting via video-conferencing today, observe two-minute silence as a tribute to the soldiers who lost their lives in #GalwanValley clash. pic.twitter.com/R9smyDFwbR

    — ANI (@ANI) June 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ముఖ్యమంత్రులతో మోదీ సమావేశం కొనసాగుతోంది. కరోనా వైరస్​ కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై నేతలు చర్చిస్తున్నారు.

భేటీ ప్రారంభానికి ముందు.. తూర్పు లద్దాఖ్​లోని గాల్వన్​ ఘటనలో అమరులైన భారత సైనికులకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్​ షా సహా 15రాష్ట్రాల ముఖ్యమంత్రులు నివాళులర్పించారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

15:11 June 17

ముఖ్యమంత్రులతో మోదీ సమావేశం

కరోనా పరిస్థితులపై సమీక్షించేందుకు.. ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండో రోజు సమావేశమయ్యారు. మంగళవారం.. 21 రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించిన ప్రధాని బుధవారం.. మహారాష్ట్ర, తమిళనాడు, దిల్లీ, గుజరాత్​ సహా 15 రాష్ట్రాల ముఖ్యమంత్రుల, జమ్ముకశ్మీర్​ లెఫ్టినెంట్​​ గవర్నర్​తో భేటీ అయ్యారు. కరోనా మహమ్మారి సవాళ్లు విసురుతున్న నేపథ్యంలో.. వైరస్​ను ఎదుర్కొనే విషయంపై నేతలు చర్చించనున్నారు.

Last Updated : Jun 17, 2020, 4:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.