అమేఠీలో ఓడిపోతాననే భయంతోనే మైనారిటీలు ఎక్కువగా ఉన్న వయనాడ్‌ను రెండో స్థానంగా రాహుల్ గాంధీ ఎంచుకున్నారని ఆరోపించారు ప్రధాని నరేంద్ర మోదీ. కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న టైటానిక్ ఓడ లాంటిదని ఎద్దేవా చేశారు.
2014లో 44 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్‌కు ఈసారి అవి కూడా దక్కవని విమర్శించారు మోదీ. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మోసపూరిత హామిలిచ్చి, ఆ తర్వాత వాటిని విస్మరించడం కాంగ్రెస్‌కు అలవాటే అని వ్యాఖ్యానించారు.
పేదలకు న్యాయ్ పథకంతో న్యాయం చేస్తామని చెబుతున్న కాంగ్రెస్, దాన్ని అమలు చేసేందుకు ప్రజలపైనే పన్నుల భారం మోపడం తథ్యమని చెప్పారు ప్రధాని మోదీ.
" కాంగ్రెస్ పరిస్థితి ముగిపోతున్న టైటానిక్ ఓడలా తయారైంది. రోజులు గడిచే కొద్దీ మునిగిపోతూనే ఉంది. కాంగ్రెస్‌తో జత కట్టిన ఎన్సీపీ వంటి పార్టీలదీ అదే పరిస్థితి. మునిగిపోకుండా తప్పించుకునేందుకు బయటపడేందుకు కొన్ని పార్టీలు పరుగులు పెడుతున్నాయి. " -- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి