ETV Bharat / bharat

బిహార్​ ఎన్నికల సమరంలో 'మోదీ డూప్​' - బిహార్​ ఎన్నికలు మోదీ

బిహార్​వాసి అభినందన్​ పాఠక్​.. హథువ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ప్రధాని పోలికలతో ఉండే అభినందన్​.. పేదల కోసమే రాజకీయాల్లోకి దిగినట్టు వెల్లడించారు. ఇచ్చిన హామీలను మోదీ నెరవేర్చలేకపోయారని.. తాను పేదల తరఫున పోరాడతానని స్పష్టం చేశారు.

Modi lookalike to fight polls in Bihar
బిహార్​ ఎన్నికల సమరంలో 'మోదీ డూప్​'
author img

By

Published : Oct 17, 2020, 10:40 AM IST

Updated : Oct 17, 2020, 12:29 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోలికలతో ఉండే అభినందన్​ పాఠక్​.. బిహార్​ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సమాజ్​ పార్టీ టికెట్​ మీద గోపాల్​గంజ్​ జిల్లా హథువ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే నామినేషన్​ పత్రాలను దాఖలు చేశారు.

పాఠక్​ సొంత జిల్లా.. ఉత్తర్​ప్రదేశ్​లోని షాహరన్​పుర్​. ఆయన ప్రస్తుతం బిహార్​ గోపాల్​గంజ్​లోని శవనహ గ్రామంలో నివాసముంటున్నారు.

మోదీతో పోలికలు ఉండటంపై ఆయన స్పందిస్తూ.. ఇది కేవలం యాదృచ్ఛికమని తెలిపారు అభినందన్​.

"ఇది కేవలం యాదృచ్ఛికం. అధికారంలోకి వచ్చినా మోదీ ఏం చేయలేకపోయారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయారు. పేదల కోసం పోరాడటానికే నేను రాజకీయాల్లోకి వచ్చా. ముందుమందు ఏం జరుగుతుందో చూడాలి."

--- అభినందన్​ పాఠక్​, సమాజ్​ పార్టీ అభ్యర్థి.

రెండో దశ పోలింగ్​లో భాగంగా.. హథువ నియోజకవర్గానికి వచ్చే నెల 3న ఎన్నికలు​ జరగనుంది. అదే నెల 10న ఫలితాలు వెలువడనున్నాయి.

ఇదీ చూడండి:- నితీశ్​ పాలనపై ఎన్​డీఏ 'ప్రగతి నివేదిక'

Last Updated : Oct 17, 2020, 12:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.