ప్రధాని నరేంద్రమోదీ పోలికలతో ఉండే అభినందన్ పాఠక్... ఉత్తర్ప్రదేశ్ లఖ్నవూ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. మోదీ పోటీ చేసే వారణాసిలోనూ పోటీ చేస్తానని ప్రకటించారు.
" ఈ నెల 26న వారణాసి స్థానానికి నామినేషన్ వేస్తాను. రెండు స్థానాల నుంచి గెలుపొందేందుకు నా శాయశక్తులా కృషిచేస్తాను. నేను డమ్మీ అభ్యర్థిని కాదు. ఎవరికి అమ్ముడుపోలేదు. ఎవరి ముందు తలవంచలేదు. ప్రజల ఆశీర్వాదం నాకు ఎప్పుడూ ఉంటుంది. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం రాహుల్ గాంధీని ప్రధాని చేసేందుకు మద్దతు ఇస్తాను."
- అభినందన్ పాఠక్, స్వతంత్ర అభ్యర్థి
తన ఎన్నికల నినాదం ' ఒక ఓటు, ఒక నోటు' అని చెప్పారు అభినందన్. స్పందించిన లఖ్నవూ జిల్లా మెజిస్ట్రేట్ కౌశల్ రాజ్ శర్మ నోటీసులు జారీ చేశారు. అభినందన్ వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించేలా ఉన్నాయని తాఖీదుల్లో పేర్కొన్నారు.
మోదీ శైలి దుస్తులే ధరిస్తారు అభినందన్. ప్రధాని తరచుగా ప్రసంగాల్లో ఉపయోగించే మిత్రోం(స్నేహితులారా) పదంతోనే మాటను ప్రారంభిస్తారు.