ETV Bharat / bharat

మెరుపుదాడులపై మరోమారు దుమారం - congress

పుల్వామా ఉగ్రదాడి, బాలాకోట్ మెరుపుదాడులపై కాంగ్రెస్ విదేశీ వ్యవహారాల ఇన్​ఛార్జ్​ శ్యామ్​ పిట్రోడా వ్యాఖ్యలపై రాజకీయ దుమారం చెలరేగింది. పిట్రోడా వ్యాఖ్యలను భాజపా తీవ్రంగా తప్పుబట్టింది. ఉగ్రవాదులకు కాంగ్రెస్​ వంతపాడుతోందని ఆరోపించింది.

వాయుదాడులపై రాజకీయం
author img

By

Published : Mar 22, 2019, 3:56 PM IST

Updated : Mar 22, 2019, 5:26 PM IST

వాయుదాడులపై రాజకీయం
ఎన్నికల వేళ పుల్వామా ఉగ్రదాడి, బాలాకోట్​ మెరుపుదాడులపై అధికార, విపక్షాల మధ్య పరస్పర ఆరోపణలు మళ్లీ మొదలయ్యాయి. ఉగ్రవాద ఘటనలపై వ్యాఖ్యలతో రాజకీయ దుమారానికి తెరలేపారు కాంగ్రెస్​ విదేశీ వ్యవహారాల బాధ్యుడు శ్యామ్​ పిట్రోడా.

"పాకిస్థాన్​ మన పొరుగుదేశం. నాకు తెలిసి పాక్​తోనే కాకుండా ప్రతిదేశంతోనూ ఆరోగ్యకరమైన చర్చలుండాలి. ముంబయి దాడి సమయంలో మేం ప్రతిఘటించాం. ఇప్పుడు విమానాలను పంపాం. కానీ అది సరైన చర్య కాదు. ప్రపంచంతో అలా వ్యవహరించకూడదు. ఓ 8 మంది వచ్చి మనపై దాడి చేస్తే.. వారి దేశం మొత్తం మీద పడిపోవటం సరికాదు. న్యూయార్క్​ టైమ్స్, ఇంకా కొన్ని వార్తాపత్రికల్లో చదివాను. మనం నిజంగా దాడులు చేశామా? 300 మందిని చంపామా? ఆ విషయం నాకు తెలియదు. కానీ ఓ పౌరుడిగా నాకు తెలుసుకునే హక్కు ఉంది."
- శ్యామ్ పిట్రోడా, కాంగ్రెస్ విదేశీ వ్యవహారాల బాధ్యుడు

ప్రజలు క్షమించరు: మోదీ

పిట్రోడా వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉగ్రవాదానికి, పాకిస్థాన్​కు కాంగ్రెస్ మద్దతు పలుకుతోందని ఆరోపణలు చేశారు. ప్రజలు క్షమించరు అనే హ్యాష్​ట్యాగ్​తో వరుస ట్వీట్లు చేసి, కాంగ్రెస్​ నాయకులపై నిప్పులు చెరిగారు మోదీ.

"రాహుల్ గాంధీకి అత్యంత నమ్మకమైన సలహాదారు పాకిస్థాన్ జాతీయ దినోత్సవాలను కాంగ్రెస్ తరఫున ప్రారంభించారు. అదీ భారత సైన్యాన్ని అవమాన పరుస్తూ సాగడం విచారకరం."
-నరేంద్రమోదీ, ప్రధాన మంత్రి

"తీవ్రవాదంపై పోరుకు కాంగ్రెస్​ అయిష్టంగానే వ్యవహరిస్తుందని దేశం మొత్తానికి తెలుసు. ఆ విషయాన్ని కాంగ్రెస్ సామ్రాజ్యానికి నమ్మిన బంటు ఒప్పుకున్నారు.
ఇది నూతన భారతం. ఉగ్రవాదులకు అర్థమయ్యే భాషలోనే వారికి సమాధానమిస్తాం."
-నరేంద్రమోదీ, ప్రధాన మంత్రి

అలవాటుగా మారింది

సమాజ్​వాదీ పార్టీ నేత రామ్​గోపాల్ యాదవ్​ వ్యాఖ్యలనూ తప్పుబట్టారు మోదీ.

"ఉగ్రవాదులకు క్షమాపణలు చెప్పటం, సైన్యాన్ని ప్రశ్నించటం విపక్షాలకు అలవాటుగా మారింది. కశ్మీర్​ను కాపాడుతున్న వారిపై రామ్​గోపాల్​ వంటి సీనియర్​ నేత అనుమానాలు వ్యక్తం చేయటం దురదృష్టకరం. ఆ వ్యాఖ్యలు అమరుల కుటుంబాలను మరింతగా బాధిస్తాయి."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

"ప్రతిపక్షాలు మరోసారి సైన్యాన్ని అవమానించాయి. వారి వ్యాఖ్యలపై ప్రతి భారతీయుడు ప్రశ్నించాలని కోరుతున్నాను. వారికి చెప్పండి.. విపక్షాల కుయుక్తులను 130 కోట్ల మంది భారతీయులు క్షమించం, మరచిపోమని. సైన్యానికి భారత్​ అండగా నిలబడుతుంది."
-నరేంద్రమోదీ, ప్రధాన మంత్రి

పాక్​కు మద్దతిస్తారా..?

పిట్రోడా వ్యాఖ్యలను కేంద్ర మంత్రి అరుణ్​జైట్లీ ఖండించారు.

"ఆయన లెక్క ప్రకారం ఉగ్రవాదుల విషయంలో మేం చేసింది తప్పు. ప్రపంచంలో ఏ దేశమూ ఇలా చెప్పలేదు. ఇస్లామిక్ దేశాల సమాఖ్య మాట్లాడలేదు. పాకిస్థాన్​ మాత్రమే ఆక్షేపించింది. ఆ దేశం మాటలను సమర్థించే వారు దేశంలోని రాజకీయ పార్టీల్లో ఉంటున్నారు. అది మన దురదృష్టం. గురువు ఎలా ఉంటే శిష్యులు అలాగే తయారవుతారు. "
-అరుణ్ జైట్లీ, కేంద్ర ఆర్థిక మంత్రి

పౌరుడిగానే ప్రశ్నించా..

తన వ్యాఖ్యలను తప్పుబడుతూ భాజపా చేస్తున్న ఎదురుదాడిపై శ్యామ్ పిట్రోడా స్పందించారు. పార్టీ తరఫున ప్రశ్నించలేదని, నిజాలను తెలుసుకోవటం పౌరుడిగా హక్కు అని బదులిచ్చారు.

"నేను ఓ పౌరుడిగానే అడిగాను. ఏం జరిగిందో తెలుసుకునే హక్కు నాకుంది. ఇందులో వివాదం ఏముందో నాకు అర్థం కావట్లేదు. ఓ పార్టీ తరఫున నేను మాట్లాడలేదు. పౌరుడిగానే నాకున్న హక్కుతోనే అడిగాను. "
- శ్యామ్​ పిట్రోడా, కాంగ్రెస్ విదేశీ వ్యవహారాల బాధ్యుడు

ఇదీ చూడండి:ఎన్నికల్లో ఓపెనింగ్​కు గౌతం గంభీర్​ సిద్ధం!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding USA, Canada and any countries included on the then-current US sanctions list. Footage may be used for news purposes in scheduled news programmes only. Any use of NBA game footage outside of regularly scheduled news programmes is prohibited and requires the express written consent of NBA Entertainment. Footage may not be used in pre-game shows, weekly sports highlight shows, coaching programmes, commercials, sponsored segments of any programme, on air promotions and opening and/or closing credits. Clients can put out highlights totaling up to three minutes from up to two games per day, provided that highlights from any one game does not exceed two minutes in total length. Use within 48 hours. No archive. No internet. Mandatory on screen credit to NBA. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Golden 1 Center. Sacramento, California, USA. 21st March, 2019.
1. 00:00 Exterior of Golden 1 Center
First Quarter
2. 00:05 Luka Doncic makes three-point shot- Mavericks 5-2
Second Quarter
3. 00:18 Dirk Nowitzki makes three-point shot- Mavericks 37-34
4. 00:34 Bogdan Bogdanovic makes slam dunk- Mavericks 42-38
Third Quarter
5. 00:42 Buddy Hield makes three-point shot- Kings 65-56
6. 00:54 Ryan Broekhoff makes three-point shot- Kings 81-73
Fourth Quarter
7. 01:07 Ryan Broekhoff makes three-point shot- Kings 100-91
8. 01:19 Buddy Hield makes three-point shot- Kings 113-97
9. 01:31 End of game- Kings win 116-100
SOURCE: NBA Entertainment
DURATION: 01:38
STORYLINE:
The Sacramento Kings defeated the Dallas Mavericks 116-100 at the Golden 1 Center in Sacramento, California, USA on Thursday.
After the first period of play, the Mavericks led the Kings 29-27.
The Kings re-took the lead heading into halftime, 53-51.
Luka Doncic had 11 points while Dirk Nowitzki made just one field goal in the first half.
The Mavericks were unable to mount a comeback in the second half as the Kings held on for the 116-100 victory.
Luka Doncic finished with 13 points shooting on a disappointing four of 13 from the field, Dirk Nowitzki had just three points, Kostas Antetokounmpo did not play, and Buddy Hield was the leading scorer of the game with 29 points.
Last Updated : Mar 22, 2019, 5:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.