మధ్యప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన ఆసియాలోనే అతిపెద్ద సౌర విద్యుత్ పార్కును జాతికి అంకితం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రధాని. మధ్యప్రదేశ్ రేవా వద్ద రూ.4,500 కోట్లతో 750 మెగావాట్ల సామర్థ్యంతో ఈ సౌర విద్యుత్ పార్కు ఏర్పాటు చేశారు.
సౌర విద్యుత్ పార్కులోని 3 విభాగాల్లో 250 మెగావాట్ల చొప్పున విద్యుత్ ఉత్పత్తి జరగనుంది. ఈ ప్రాజెక్టులో 24 శాతం విద్యుత్‌ను దిల్లీ మెట్రోకు సరఫరా చేయనున్నారు. మిగతా 76 శాతాన్ని రాష్ట్ర విద్యుత్ సంస్థకు అందిస్తారు.
కేంద్ర సహకారంతో..
దేశంలో ఇది మెుట్టమెుదటి సౌర విద్యుత్ ప్రాజెక్టు. 2022కి గాను గిగావాట్ పునరుత్పాదక ఇంధన సామర్థ్యంతోపాటు 100 గిగావాట్ల సౌర విద్యుత్‌ను సాధించేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని కార్యాలయం ప్రకటించింది.
రేవా అల్ట్రా మెగా సోలార్ లిమిటెడ్ (ఆర్యూఎంఎస్ఎల్), మధ్యప్రదేశ్ ఉర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్, భారత సోలార్ కార్పొరేషన్ సంయుక్తంగా ఈ పార్క్‌ను నిర్మించాయి. ఈ సోలార్ పార్క్‌ను అభివృద్ధి చేయటానికి కేంద్ర ప్రభుత్వం రేవా సోలార్ కంపెనీకి రూ.138 కోట్లు అందించింది.
ఇదీ చూడండి: నేటి అవసరం.. డిజిటల్‌కు అనుసంధానం!