బక్రీద్ సందర్భంగా ప్రజలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుభాకాంక్షలు తెలిపారు. దేశవిదేశాల్లో ఉన్న ప్రజలు.. ముఖ్యంగా ముస్లింలకు ప్రత్యేక సందేశమిచ్చారు.
"ప్రేమ, సోదర భావం, మానవ సేవకు ఈద్ ఉల్ అజా ప్రతీక. ఈ విలువలను మనం పాటించి మన సంస్కృతికి కట్టుబడి ఉందాం."
-రామ్నాథ్ కోవింద్, రాష్ట్రపతి
బక్రీద్తో సమాజంలో శాంతి, సౌఖ్యం పెరగాలని ప్రధాని నరేంద్రమోదీ ఆకాంక్షించారు.
"ఈద్ ఉల్ అజా సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు. ఈ పర్వదినం.. సమాజంలో శాంతి, సౌఖ్యం పెంపొందించాలి."
-ప్రధాని నరేంద్రమోదీ
ఇదీ చూడండి: జమ్ము కశ్మీర్లో ఆంక్షల నడుమే బక్రీద్