ఉత్తరప్రదేశ్లోని బారాబంకీలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. విపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. విపక్ష మహాకూటమి నేతలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని అన్నారు. నాలుగు దశల పోలింగ్ అనంతరం విపక్షాలు దాగుడుమూతలు ఆడుతున్నాయని ఎద్దేవా చేశారు. ప్రజలే వారికి సమాధానం చెప్తారని అన్నారు.
"ఎవరైతే ఇన్ని రోజులు 'కౌన్ బనేగా ప్రధానమంత్రి' ఆటలు ఆడారో... నాలుగు దశల పోలింగ్ అనంతరం దాగుడుమూతలు ఆడుకోవడంలో బిజీగా ఉన్నారు. ఒకరిపై ఒకరు నిలబడి ప్రధాని కుర్చీ అందుకోవాలని కలలు కంటున్నారు. కానీ నాలుగు దశల పోలింగ్ తర్వాత వారి కలలను ప్రజలు చిత్తుచిత్తు చేశారు."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
ఇదీ చూడండి: 'అమ్మా.. నిన్ను చూస్తే గర్వంగా ఉంది'