ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ఉత్తరాఖండ్‌లోని బదరీనాథ్ ఆలయాన్ని సందర్శించనున్నారు. శనివారం ఆయన కేదార్నాథ్ ఆలయాన్ని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ధ్యానంలో కూర్చున్నారు. నేటి ఉదయం ధ్యానం ముగించి.. బదరీనాథ్‌కు పయనమవుతారు మోదీ.
అభివృద్ధిపై ఆరా..
కేదారనాథుడిని శనివారం దర్శించుకున్న అనంతరం అక్కడి కొండ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పరిశీలించారు మోదీ. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆలయ సమీపంలోని పవిత్ర రుద్ర గుహకు చేరుకునేందుకు రెండు కిలోమీటర్ల మేర ట్రెక్కింగ్ చేశారు. రుద్ర గుహలో యోగ ముద్రలో ఉన్నారు మోదీ.
కేదార్నాథ్ ఆలయాన్ని గత రెండేళ్లలో మోదీ దర్శించుకోవడం ఇది నాలుగోసారి.
2013లో వచ్చిన జల ప్రళయానికి కేదార్నాథ్ పూర్తిగా కకావికలమైంది. పునరుద్ధరణ పనులు ఇంకా కొనసాగుతున్నాయి.
ఇదీ చూడండి : కర్ణాటక అసెంబ్లీని రద్దు చేయాలి: జేడీఎస్ నేత