నరేంద్రమోదీ చిన్న వయసులోనే ఇంటిని వదిలి, హిమాలయాలు, ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలు చుట్టొచ్చారు. అనంతరం రాజనీతి శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. 1972లో ఆరెస్సెస్‌లో చేరి, రాజకీయ జీవితానికి నాంది పలికారు.
ఇందిరాగాంధీ ఎమర్జెన్సీతో వెలుగులోకి..
1975-77లో ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని విధించారు. ఆ రోజుల్లోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కరపత్రాలు ముద్రించి, వాటిని పంపిణీ చేశారు నరేంద్ర మోదీ. ఈ సందర్భంలోనే మోదీలోని నాయకత్వ లక్షణాలు, నిర్వహణ, సంస్థాగత నైపుణ్యాలు అందరికీ తెలిశాయి.
రాజకీయ ప్రస్థానం
- 1985లో భాజపాలోకి ప్రవేశం
- 1987లో భాజపా గుజరాత్ విభాగం ఆర్గనైజేషన్ సెక్రటరీగా నియామకం
- అహ్మదాబాద్ నగర పంచాయతీ ఎన్నికల్లో తొలి విజయం.
- 1990లో అడ్వాణీ అయోధ్య రథ యాత్రలో కీలకపాత్ర
- 1991-92లో మురళీమనోహర్ జోషి ఏక్తా యాత్రలోనూ కీలకం
- 1995లో భాజపా జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు
- 1998లో అంతర్గత రాజకీయ వివాదాలు పరిష్కరించి, లోక్‌సభ ఎన్నికల్లో భాజపా విజయానికి మోదీ తోడ్పాటు. అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియామకం.
- 2002లో గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో రాజ్‌కోట్-2 నియోజకవర్గం నుంచి గెలుపు- తొలిసారి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన మోదీ.
- గుజరాత్ అల్లర్లు, ప్రతిపక్షాల విమర్శలు, అధిష్ఠాన ఒత్తిడితో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా.
- అదే సంవత్సరం డిసెంబర్ ఎన్నికల్లో గెలిచి, తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు.
- 2014 ఎన్నికల్లో భాజపా ప్రధానమంత్రి అభ్యర్థిగా వారణాసి, వడోదర నుంచి విజయం.
- 2014 మే 26న 14వ ప్రధానిగా బాధ్యతల స్వీకరణ.
- 2019 మే 30న ప్రధానిగా మరోమారు ప్రమాణస్వీకారం.
ఇదీ చూడండి: మోదీ కొత్త జట్టులో అవకాశం వీరికే..!