ETV Bharat / bharat

''మోదీ-బలమైన వ్యక్తి' కల్పితమే.. దేశ అతిపెద్ద బలహీనత' - Galwan Valley

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చేందుకు బలమైన వ్యక్తిగా చిత్రీకరించుకోవటమే ఇప్పుడు దేశ అతిపెద్ద బలహీనతగా మారిందని ఆరోపించారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని పునరుద్ఘాటించారు. మోదీ.. తన 56 అంగుళాల ఛాతీ సిద్ధాంతాన్ని కాపాడుకోవాలని ఎద్దేవా చేశారు.

Rahul
కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్
author img

By

Published : Jul 20, 2020, 12:44 PM IST

Updated : Jul 20, 2020, 12:50 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మరోమారు విమర్శలు గుప్పించారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. శక్తిమంతమైన నాయకుడిగా మోదీ తనను తాను చిత్రీకరించుకోవటమే.. భారత్​కు అతిపెద్ద బలహీనతగా మారిందని విమర్శించారు. చైనా.. భారత భూభాగాన్ని ఆక్రమించిందని పునరుద్ఘాటించారు. అధికారంలోకి వచ్చేందుకు శక్తిమంతమైన నేతగా చిత్రీకరించుకున్న మోదీ.. తన 56 అంగుళాల ఛాతీ సిద్ధాంతాన్ని కాపాడుకోవాలంటూ చురకలంటించారు.

చైనా వ్యూహాత్మక ప్రణాళిక పేరిట ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్టు చేశారు రాహుల్‌. సరిహద్దు సమస్య ఒక్కటే చైనా వ్యూహం కాదని అభిప్రాయపడ్డారు.

  • PM fabricated a fake strongman image to come to power. It was his biggest strength.

    It is now India’s biggest weakness. pic.twitter.com/ifAplkFpVv

    — Rahul Gandhi (@RahulGandhi) July 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఇప్పటికీ చైనా భారత భూభాగంలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఎలాంటి వ్యూహాత్మక ప్రణాళిక లేకుండా చైనీయులు ఏమీ చేయరు. ప్రపంచ ఆకృతిని మార్చాలనే లక్ష్యంగా చైనా దూకుడుగా ప్రవర్తిస్తోంది. అందుకు గ్వాదర్​ నౌకాశ్రయం, బెల్ట్​ అండ్​ రోడ్​ ఇనిషియేటివ్​ నిర్మాణాలే ఉదాహరణ.

పాక్‌తో కలిసి చైనా.. కశ్మీర్‌లో ఏదో చేయాలని ప్రణాళికలు రచిస్తోంది.. అందుకే ఇది కేవలం సరిహద్దు సమస్య మాత్రమే కాదు, ప్రధానిపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు సృష్టించిన సమస్య. తద్వారా ఆయన కల్పించుకున్న 56 అంగుళాల ఛాతీ అనే సిద్ధాంతాన్ని దెబ్బతీయాలని చైనా భావిస్తోంది."

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్ సీనియర్​​ నేత

తాము చెప్పినట్లు చేయని పక్షంలో మోదీ బలమైన నేత అన్న భావవను దెబ్బ తీస్తామని.. చైనా చెబుతోందని రాహుల్‌ వెల్లడించారు. దీనిపై ప్రధాని ఏ విధంగా స్పందిస్తారని రాహుల్‌ ప్రశ్నించారు.

ఇదీ చూడండి: కరోనా,జీడీపీ, చైనాపై భాజపా చెప్పేవన్నీ అబద్ధాలే'

Last Updated : Jul 20, 2020, 12:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.