ETV Bharat / bharat

మోదీ గెలుపులో వీటి ప్రభావమెంత...?

నరేంద్ర మోదీ... భారత రాజకీయాల్లో ఓ ప్రభంజనం. అనతి కాలంలోనే భారత్​తో పాటు ప్రపంచంలోనూ బలమైన నేతగా పేరుగాంచారు. రాజకీయాల్లో మోదీ ఎంత వేగంగా ఓనమాలు నేర్చుకున్నారో ఆయన తీసుకున్న సాహసోపేత నిర్ణయాలను చూస్తే అర్థం చేసుకోవచ్చు. అందులో మచ్చుకు కొన్ని... పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, మెరుపు దాడులు, మేనిఫెస్టోలో రైతులకు వరాలు. ఇవన్నీ ఆయనను శక్తిమంతమైన నేతగా, ప్రజానేతగా నిలబెట్టాయి.

మోదీ
author img

By

Published : May 24, 2019, 7:02 AM IST

మోదీ సంచలన నిర్ణయాలు

ఐదేళ్ల పాలన. ఎన్నో సాహసోపేత నిర్ణయాలు. ప్రత్యర్థుల నుంచి అంతులేని విమర్శలు. కొన్నిసార్లు ప్రజలూ ఇబ్బందిపడ్డ పరిస్థితులు. అయినా... ఎక్కడా వెనక్కి తగ్గలేదు. దేశానికి మేలు చేస్తుందనుకున్న నిర్ణయాల అమలులో వెనుకడుగు వేయలేదు నరేంద్ర మోదీ. ఈ వైఖరే... మోదీని ప్రత్యేకంగా నిలిపింది. శక్తిమంతమైన, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోగల నేతగా ప్రజల నమ్మకాన్ని మరింత పెంచింది. మరోమారు అధికారం దక్కేందుకు కారణమైంది.

ఐదేళ్లలో మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలలో కొన్ని....

1. పెద్ద నోట్ల రద్దు

2016 నవంబర్​ 8... భారత ఆర్థిక చరిత్రలో ఈ తేదీ ఓ మలుపు. ఆ రోజు రాత్రి పెద్ద నోట్లు రద్దు చేస్తున్నట్లు సంచలనాత్మక ప్రకటన చేశారు ప్రధాని మోదీ.

నల్ల ధనాన్ని నిర్మూలించి అన్ని లావాదేవీలు సక్రమంగా జరిగేలా చూడటానికి ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. నగదు కొరత ఏర్పడింది. కొన్ని నెలలపాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయినా... పర్యవసానాలు మంచి ఫలితాలే ఇచ్చినట్లు తెలుస్తోంది. చాలా మంది నిపుణులు, ఆర్థిక వేత్తలు మోదీ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. ఓ మంచి ప్రయత్నంగా ప్రశంసించారు.

పెద్ద నోట్ల రద్దుతో కలిగిన అతిపెద్ద ప్రయోజనం... డిజిటల్​ చెల్లింపులు. యూనిఫైడ్​ పేమెంట్​ ఇంటర్​ఫేస్​(యూపీఐ)ను ప్రవేశపెట్టి.. ఈ-చెల్లింపులను విస్తరించింది కేంద్రం. డిజిటల్​ చెల్లింపులు రికార్డు స్థాయిలో వేల కోట్లకు చేరాయి.

2. వస్తు సేవల పన్ను(జీఎస్టీ)

దేశంలో అన్ని రంగాల పురోగమనమే లక్ష్యంగా తీసుకొచ్చిన జీఎస్టీ... సమాఖ్య స్ఫూర్తికి చక్కటి ఉదాహరణ. స్వాతంత్ర్యానంతరం అమల్లోకి వచ్చిన అతిపెద్ద పరోక్ష పన్నుల సంస్కరణగా ప్రశంసలొచ్చాయి. సామాన్యులు ఎక్కువగా ఉపయోగించే వస్తువులపై పన్ను భారం బాగా తగ్గింది. భాజపా ప్రభుత్వ నిర్ణయాన్ని ఎందరో ప్రముఖ విశ్లేషకులు, ప్రపంచవ్యాప్తంగా నిపుణులు కొనియాడారు.

మొదట్లో జీఎస్టీ శ్లాబుల విధానంపై కొన్ని వర్గాల్లో అసంతృప్తి నెలకొంది. అనంతరం వరుస సమావేశాలు నిర్వహిస్తున్న జీఎస్టీ మండలి.. పన్ను శాతాల్ని వస్తువుల వారీగా తగ్గిస్తూ కొంత మేర సానుకూలంగా వ్యవహరిస్తోంది. నెల నెలా రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతూ దూసుకెళ్తోంది.

జీఎస్టీ వల్ల కలిగిన పెద్ద ప్రయోజనం.. పన్ను చెల్లింపుదార్ల సంఖ్య పెరగడమే. రిటర్నులూ పెరిగాయి. దీర్ఘకాలంగా మంచి ప్రయోజనాలు ఉంటాయని భావిస్తున్నారు నిపుణులు.

3. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్​

అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు మోదీని మరో స్థాయికి తీసుకెళ్లింది. జనవరి 7, 8 తేదీల్లో పార్లమెంట్​ ఉభయసభల్లో ఆమోదం పొందిన బిల్లుపై.. 12న రాష్ట్రపతి ఆమోదముద్ర పడింది. 10 శాతం కోటా వల్ల లాభపడే సామాజిక వర్గాలు భాజపాకు అండగా నిలిచాయి.

4. మెరుపుదాడులు

మోదీ సర్కార్​ ఐదేళ్ల కాలంలో అతి పెద్ద సవాల్​తో తీసుకున్న నిర్ణయం మెరుపుదాడులు. నేరుగా ఉగ్రమూలాలపై దెబ్బకొట్టే ఆలోచనతో చేపట్టిన సోహసోపేత చర్య.

ఉరీ సెక్టార్​లో భారత సైనిక స్థావరంపై ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా 2016 సెప్టెంబర్​ 29న మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. పాక్​ ఆక్రమిత కశ్మీర్​లోకి భారత సైన్యాన్ని పంపి.. ఉగ్ర శిబిరాలను, ముష్కరుల్ని తుదముట్టించారు.

మోదీ నిర్ణయాన్ని రాజకీయాలకు అతీతంగా ప్రశంసించారు. దేశ భద్రతకు సంబంధించిన అంశంలో యావత్​ భారతావని మోదీ వెన్నంటే నిలిచింది.

2019.. పుల్వామా ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగా.. మోదీ విభిన్నంగా ఆలోచించారు. ఈ సారి వాయుసేనతో మెరుపుదాడులు చేయించారు. అది కూడా పాకిస్థాన్​ భూభాగంలో. బాలాకోట్​ ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసి, ఎందరో తీవ్రవాదులను మట్టుబెట్టడంలో విజయం సాధించగలిగారు.

ప్రసంగాల్లోనూ అదే...

సాహసోపేత నిర్ణయాల అమలుతో సరిపెట్టలేదు మోదీ. వాటిపై వచ్చిన విమర్శలనూ అంతే దూకుడుగా తిప్పికొట్టారు. ఎన్నికల ప్రచారాల్లోనూ ఈ అంశాలను విస్తృతంగా తీసుకెళ్లగలిగారు. సైన్యం సాహసాలను కీర్తిస్తూ.. భాజపా సర్కార్​ విజయంగా ప్రజల్లో నాటుకుపోయేలా చేశారు. బాలాకోట్​ వైమానిక దాడిని ప్రస్తావించని సభ ఉండదంటే అతిశయోక్తి కాదు.

ఇంకా ఎన్నికలకు ముందు బడ్జెట్​లో ప్రవేశపెట్టిన అంశాలు, మేనిఫెస్టోలో పొందుపర్చిన విషయాలు కొన్ని వర్గాల వారిని భాజపా వైపు మళ్లేలా చేశాయి. ముఖ్యంగా ప్రధానమంత్రి కిసాన్​ సమ్మాన్​ యోజన వంటి పథకాలు.. రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేదే.

ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్​లో పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలు..., దేశ భద్రతకు సంబంధించి లక్షిత దాడులు.. ఓటర్లను మోదీపై నమ్మకాన్ని మరింత పెంచాయి. మరో ఐదేళ్ల పాటు మోదీనే ప్రధాని పీఠంపై కూర్చోబెట్టాలని నిర్ణయించుకునేందుకు కారణమయ్యాయి.

ఇదీ చూడండి: చాయ్​వాలానే కాదు... చౌకీదారూ గెలిచారు

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Beijing, China - May 23, 2019 (CCTV - No access Chinese mainland)
1. Press conference in progress
2. Various of reporters
3. SOUNDBITE (Chinese) Gao Feng, spokesman, Chinese Ministry of Commerce:
"Apart from requirements of inspection and quarantine, China has no restriction or relevant management measures for the import of pork. Enterprises are allowed to operate independently and engage in free trade according to market conditions such as supply and demand, price and quality."
4. Various of press
5. SOUNDBITE (Chinese) Gao Feng, spokesman, Chinese Ministry of Commerce:
"The United States is one of the main sources of China's pork imports. Whether to buy pork from the U.S. or not is an independent market behavior of enterprises. As far as we know, due to the recent escalating trade frictions between China and the U.S., domestic enterprises have unstable expectations for the U.S. market, which will inevitably affect normal business activities."
FILE: Beijing, China - Date Unknown (CCTV - No access Chinese mainland)
6. Various of pork market; vendors at stalls; pork for sale
Chinese enterprises have the right to decide whether to import pork from the U.S., said a spokesman of the Ministry of Commerce on Thursday in Beijing.
Chinese buyers canceled orders for 3,247 tons of U.S. pork earlier this month, the biggest cancellation in more than a year, according to U.S. Department of Agriculture data released last week.
Spokesman Gao Feng of the Chinese Ministry of Commerce told reporters at a regular press briefing in response to a question on whether China will continue to import pork from the U.S.
"Apart from requirements of inspection and quarantine, China has no restriction or relevant management measures for the import of pork. Enterprises are allowed to operate independently and engage in free trade according to market conditions such as supply and demand, price and quality," said Gao.
According to statistics from the Chinese customs, China's pork imports mainly come from 15 countries including Germany, Spain, the United States, Canada, Denmark, Brazil, the Netherlands and France. Since the second half of 2018, China's pork imports have increased due to the impact of domestic pig breeding stock and declining production of pork.
In the first quarter, the total import of pork, beef, chicken, mutton and other meat was 1.112 million tons, an increase of 11.6 percent year on year. It is expected that China's meat import will continue to increase.
"The United States is one of the main sources of China's pork imports. Whether to buy pork from the U.S. or not is an independent market behavior of enterprises. As far as we know, due to the recent escalating trade frictions between China and the U.S., domestic enterprises have unstable expectations for the U.S. market, which will inevitably affect normal business activities," Gao added.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.