ETV Bharat / bharat

కరోనాపై కలిసి పోరాడదాం.. సార్క్​ దేశాలకు మోదీ పిలుపు

ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోన్న కరోనాపై సార్క్​ దేశాధినేతలు కలిసి పోరాడేందుకు ముందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు ఉన్న ఏ అవకాశాన్నీ వదులుకోరాదని సూచించారు.

modi call to saarc nations to fight corona
కరోనాపై కలిసి కట్టుగా పోరాడదాం.. సార్క్​ దేశాలకు మోదీ పిలుపు
author img

By

Published : Mar 13, 2020, 2:17 PM IST

ప్రపంచమంతటా కరోనా వైరస్​ వ్యాప్తి చెందుతున్న వేళ.. ఈ మహమ్మారిని అరికట్టేందుకు సార్క్ దేశాధినేతలు కలిసికట్టుగా కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు సార్క్ దేశాలు వీడియో కాన్ఫరెన్స్​​ ద్వారా చర్చించాలని సూచించారు.

modi tweet
మోదీ ట్వీట్​

ప్రపంచంలోని అనేక దేశాలు కరోనా వైరస్​తో పోరాడుతున్నాయి. ప్రభుత్వాలు, ప్రజలు ఈ మహమ్మారి నుంచి బయటపడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు సార్క్​ దేశాధినేతలు ముందుకు రావాలని పిలుపునిస్తున్నా.

-మోదీ ట్వీట్​

ప్రపంచంలో గణనీయమైన జనాభా కలిగిన దక్షిణాసియా.. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే విషయంలో చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకూడదని ఉద్ఘాటించారు మోదీ.

దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార సదస్సు( సార్క్​)లో అఫ్గానిస్థాన్​, బంగ్లాదేశ్​, భూటాన్​, భారత్​, మాల్దీవులు, నేపాల్​, పాకిస్థాన్​, శ్రీలంక సభ్యదేశాలు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.