ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్‌ఘాట్‌ను సందర్శించారు. ఎర్రకోటపై జాతీయ పతాకం ఎగురవేసే ముందు మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. బాపూజీ సమాధికి పుష్పాంజలి ఘటించారు మోదీ.
![Modi at rajghat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8425727_8_8425727_1597456129392.png)
![Modi at rajghat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8425727_272_8425727_1597456101325.png)
అంతకుముందు దేశ ప్రజలకు పంద్రాగస్టు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని. 'దేశవాసులందరికీ దినోత్సవ శుభాకాంక్షలు. జైహింద్' అంటూ ట్వీట్ చేశారు.
![Modi at rajghat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8425727_930_8425727_1597456070140.png)
మరోవైపు ఎర్రకోట వద్ద పటిష్ఠ భద్రతతో అన్నిఏర్పాట్లు చేశారు అధికారులు. కరోనా వ్యాప్తి దృష్ట్యా భౌతిక దూరం వంటి నిబంధనలను పాటిస్తున్నారు.
![Modi at rajghat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8425727_483_8425727_1597455827918.png)
![Modi at rajghat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8425727_676_8425727_1597455750606.png)