ETV Bharat / bharat

కోతి మృతితో సింగపూర్​ ట్రిప్​ మధ్యలో ఆపేసిన ఎమ్మెల్యే​ - MYSORE MONKEY DIED MLA RETURN TO HIS TRIP

ఓ ఎమ్మెల్యే కొత్త సంవత్సరం సందర్భంగా కుటుంబంతో కలిసి సరదాగా గడపడానికి సింగపూర్​ వెళ్లారు. అనుకోకుండా ఓ కోతి చనిపోయిందని వార్త అందింది. వెంటనే ఇంటిల్లిపాది తిరుగుపయనమయ్యారు. ఇంతకీ ఏంటీ కథ?

MLA Returned from Singapore just Because of monkey
కోతి మృతితో సింగపూర్​ ట్రిప్​ మధ్యలో ఆపేసిన ఎమ్మెల్యే​
author img

By

Published : Jan 7, 2020, 6:56 PM IST

Updated : Jan 7, 2020, 7:55 PM IST

మైసూరులోని కేఆర్​ నగర నియోజకవర్గ ఎమ్మెల్యే ఎస్​.ఆర్​. మహేశ్​​ కొత్త ఏడాది సందర్భంగా కుటుంబంతో కలిసి సింగపూర్​ వెళ్లారు. అక్కడ దిగీ దిగగానే ఓ కోతి చనిపోయిందని మహేశ్​​కు ఫోన్​ అందింది. అంతే వెంటనే ఇంటిల్లిపాది సింగపూర్​ నుంచి తిరుగుపయనం అయ్యారు. ఒక కోతి చనిపోతే ఎమ్మెల్యే ఇంతలా స్పందించడం ఏంటని అనుకుంటున్నారా?

మూడేళ్లుగా...

మూడేళ్ల క్రితం ఎమ్మెల్యే మహేశ్​ పొలంలో వానర సంచారం ఎక్కువగా ఉండేది. కోతులు పంటంతా నాశనం చేసేవి. కొద్ది రోజుల తర్వాత ఆ కోతులన్నీ అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఒక్క వానరం మాత్రం అక్కడే ఉండిపోయింది. అప్పటి నుంచి ఆ వానరాన్ని చేరదీసి ప్రేమగా చూసుకుంటున్నారు మహేశ్​. దానికి చింటూ అని పేరు కూడా పెట్టారు.

ఇటీవల కొత్త ఏడాదిని జరుపుకునేందుకు కుటుంబంతో కలిసి సింగపూర్​ వెళ్లారు మహేశ్. జనవరి 4వరకు అక్కడే ఉండేలా ప్రణాళిక వేసుకున్నారు. ఇంతలోనే చింటూ విద్యుదాఘాతం వల్ల చనిపోయిందని వార్త అందింది. వెంటనే కుటుంబసభ్యులంతా తిరిగి వచ్చారు.
మనుషులతో సమానంగా ఈ వానరానికి అంత్యక్రియలు నిర్వహించారు మహేశ్​.

కోతి మృతితో సింగపూర్​ ట్రిప్​ మధ్యలో ఆపేసిన ఎమ్మెల్యే​

ఇదీ చూడండి : 'మరింత దృఢంగా భారత్​-అమెరికా స్నేహబంధం'

Intro:Body:

MLA Mahesh Returned from Singapore just Because of monkey

Mysore(Karnataka): K.R Nagara MLA Sa.Ra.Mahesh shortens his trip and Returned by Singapore because His Monkey died by the current shock.

Before 3 years in MLA Mahesh's farm Lot of monkeys were found and they destroyed the crops, but after some time suddenly all the Monkeys were migrated from there But this monkey cub didn't go any were. That's why Mahesh took that cub and looked after it and also he named to that as Chintu.

Mahesh and his family went to Singapore trip for the new year celebration and he had a schedule of returning date Jan-4. But by hearing the news of monkey death, Family returned on Jan 2nd.

Monkey Chintu Died on Jan-1st due to the current shock in the Farm. After that Mahesh Had given the salvation to a monkey in a systematic way by burying the body as in the way of Human Being.

Conclusion:
Last Updated : Jan 7, 2020, 7:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.