ETV Bharat / bharat

తల్లికి కరోనా ఉందని తప్పుడు నివేదిక- శిశువు మృతి - నవజాత శిశువ మృతి

కర్ణాటకలో ఓ ప్రైవేట్ ల్యాబ్ నిర్లక్ష్యం నవజాత శిశువు మృతికి కారణమైంది. తల్లికి కరోనా సోకిందని తప్పుడు నివేదిక ఇవ్వటం వల్ల ఇద్దరిని వేరుగా ఉంచారు వైద్యులు. 6 రోజులుగా తల్లికి దూరంగా ఉన్న బాలుడు.. శ్వాస ఇబ్బందులతో మంగళవారం మృతి చెందాడు.

corona report
తల్లికి కరోనా ఉందని తప్పు నివేదిక
author img

By

Published : Jun 24, 2020, 7:31 PM IST

కర్ణాటక దావణగిరిలోని ఓ ప్రైవేటు ల్యాబ్​ చేసిన నిర్వాకం నవజాత శిశువు మృతికి కారణమైంది. శిశువు తల్లికి కరోనా పాజిటివ్​ అని తప్పుడు నివేదిక ఇవ్వటమే ఇందుకు కారణం. కరోనా ఉందని శిశువు జన్మించాక తల్లి నుంచి వేరుగా ఉంచారు. శ్వాసకోశ ఇబ్బందితో చిగాతెరి ఆసుపత్రిలో 6 రోజుల తర్వాత ఆ శిశువు మృతి చెందింది.

ఓ ప్రైవేటు ల్యాబ్​లో జూన్​ 18న కరోనా పరీక్ష చేయించుకుంది ఆ గర్భిణీ. నివేదికల్లో పాజిటివ్​గా రావటం వల్ల జిల్లా ఆసుపత్రిలో చేరింది. ప్రసవం జరిగిన తర్వాత శిశువును ఐసీయూలో ఉంచారు. ఆమె ఎలాంటి కంటైన్మెంట్ జోన్​లో లేనందున మరోసారి బెంగళూరు ల్యాబ్​లో పరీక్షించగా నెగటివ్​గా వచ్చింది. అయితే అప్పటికే శిశువు మరణించింది.

తల్లిని చూడకుండానే..

ల్యాబ్​ నిర్లక్ష్యంపై శిశువు తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం బాలుడి ముఖాన్ని తల్లికి చూపించలేకపోయామని ఆవేదన చెందారు. తమకు న్యాయం జరగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: 'కరోనా వినాశక విఘ్నేశుడు సిద్ధం!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.