పబ్-జీ ఆడొద్దని వారించినందుకు సొంత అన్ననే హత్య చేశాడు ఓ బాలుడు. మహారాష్ట్రలోని థానే జిల్లా భివాండిలో జరిగింది ఈ దారుణం.
అసలేం జరిగిందంటే...
మహమ్మద్ షేక్ (19) అనే వ్యక్తి... 15 ఏళ్ల తన తమ్ముడితో పబ్-జీ ఆడొద్దని వారించాడు. గేమ్ ఆడొద్దన్నాడనే కోపంతో షేక్‌ను తొలుత గోడకు బాదాడు తమ్ముడు. అంతేకాకుండా కత్తెరతో దాడికి దిగాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా గమనించిన కుటుంబ సభ్యులు షేక్‌ను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు నిర్ధరించారు వైద్యులు.
ఘటనపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు స్థానిక ఎస్ఐ మమతా డిసౌజ తెలిపారు.
ఇదీ చూడండి: మహారాష్ట్రను వణికిస్తున్న భారీ వర్షాలు