మధ్యప్రదేశ్ ఇందోర్లో దారుణం జరిగింది. ఓ 11 ఏళ్ల బాలుడు, 10 ఏళ్ల బాలికను కిరాతకంగా హత్య చేశాడు.
ఇందోర్, లాసుడియాలో సోమవారం ఓ బాలిక మృతదేహం లభ్యమైంది. పోలీసుల ప్రాథమిక విచారణలో నిర్ఘాంతపోయే నిజాలు బయటపడ్డాయి. లాసుడియాలోని, ఓ కాలనీకి చెందిన బాలుడిని అదే కాలనీలోని మరో బాలిక ఓ ఆన్లైన్ ఆటలో పలుమార్లు ఓడించింది. దీంతో కక్ష పెంచుకున్న బాలుడు.. ఆ బాలికను తలమీద రాళ్లతో కొట్టి చంపేశాడు.
"లాసుడియా ప్రాంతంలో ఓ 11 ఏళ్ల బాలుడు, 10 ఏళ్ల బాలికను కిరాతకంగా హత్య చేశాడు. బాలికను తమ ఇంటికి సమీపంలోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. రాళ్లతో తలపై బాది చంపేశాడు."
-హరినారాయణ్ చారి మిశ్రా, ఇందోర్ ఐజీ
ఇదీ చదవండి: బిహార్ ఎన్నికల ప్రచారాస్త్రంగా సుశాంత్..!