ETV Bharat / bharat

ఆఫీస్​లకు మంత్రులు- పూర్తిస్థాయిలో ప్రభుత్వ కార్యకలాపాలు - central minister in offices

లాక్​డౌన్​ ముగుస్తున్న నేపథ్యంలో జాతినుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించడానికి ఒక్క రోజు ముందు కేంద్రమంత్రులు, సీనియర్​ అధికారులు తమ కార్యాలయాల్లో విధులకు హాజరయ్యారు. ప్రస్తుత పరిస్థితిపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. లాక్​డౌన్ కారణంగా గత కొద్ది రోజులుగా వీరంతా ఇళ్ల నుంచే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Ministers, officials return to offices
మోదీ ప్రసంగం నేపథ్యంలో కార్యాలయాలకు కేంద్ర మంత్రులు
author img

By

Published : Apr 13, 2020, 7:44 PM IST

దేశవ్యాప్త లాక్​డౌన్​ కారణంగా మార్చి 21నుంచి ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్న కేంద్ర మంత్రులు, సీనియర్ అధికారుల ఈ రోజు కార్యాలయాలకు హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం జాతినుద్దేశించి ప్రసంగించినున్న నేపథ్యంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. దేశంలో ప్రస్తుత పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యాలయాల్లో భౌతిక దూరం పాటిస్తూనే విధులు నిర్వర్తించినట్లు తెలిపారు మంత్రులు.

" లాక్​డౌన్ సమయంలో ఇంటి నుంచే విధులు నిర్వహించాను. చాలా రోజుల తర్వాత ఈరోజే శాస్త్రి భవన్​లోని ఆఫీస్​కు వచ్చినందుకు సంతోషంగా ఉంది. మోదీ ప్రభుత్వం అన్ని చర్యలతో సిద్ధంగా ఉంది."

-ప్రహ్లాద్​ జోషీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి.

కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్, మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తర్ అబ్బాస్ నఖ్వీ, రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్​, కీరన్​ రీజు, ప్రహ్లాద్ పటేల్ సోమవారం కార్యాలయాల నుంచే విధులు నిర్వర్తించారు.

కరోనా కట్టడికి కేంద్రం విధించిన లాక్​డౌన్​ మంగళవారంతో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఉదయం 10 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు మోదీ. లాక్​డౌన్​ మరో రెండు వారాల పాటు పొడిగిస్తూ, ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా కీలక ప్రకటన చేసే సూచనలు కన్పిస్తున్నాయి.

ఇదీ చూడండి: 'రేషన్​ కార్డ్ లేనివారికీ 10 కిలోల ఆహార ధాన్యాలు...'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.