ETV Bharat / bharat

'రేషన్​ కార్డ్ లేనివారికీ 10 కిలోల ఆహార ధాన్యాలు...' - 'రేషన్​ కార్డు లేనివారికీ ఆహార ధాన్యాలు అందించండి'

లాక్​డౌన్​ నేపథ్యంలో ఆహార భద్రత చట్టం కింద పేదలకు సెప్టెంబర్​ వరకు ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున ఆహార ధాన్యాలు ఇవ్వాలని కోరారు కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ. ఈ మేరకు ఆహార భద్రతపై పలు సూచనలు చేస్తూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

Sonia writes to PM
కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాం
author img

By

Published : Apr 13, 2020, 6:13 PM IST

ఆహార భద్రత చట్టానికి అనుగుణంగా దేశంలోని పేదలకు ఆహార పదార్థాలు అందించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ. కరోనా నేపథ్యంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో పేదలకు చేయూత అందించేందుకు అమలు చేస్తోన్న ఉచిత సరఫరా పథకాన్ని ఈ ఏడాది సెప్టెంబర్​ వరకు కొనసాగించాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

ఆరు నెలల పాటు 10 కిలోలు..

దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ పరిస్థితుల్లో వలస కూలీలకు ఆహార భద్రత కల్పించాలని కోరారు సోనియా గాంధీ. ఆహార భద్రత కార్డు లేని వారికీ.. ఈ పథకాన్ని వర్తింప చేయాలని అభ్యర్థించారు. ఆరు నెలల పాటు ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున ఆహార ధాన్యాలు ఉచితంగా అందించాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నో కుటుంబాలు ఆహారం కోసం అలమటించే పరిస్థితిలోకి వెళ్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు సోనియా. ప్రజలను ఆహార ద్రవ్యోల్బణం బారిన పడకుండా కాపాడతారనే ఉద్దేశంతోనే ఈ సూచనలు చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

ధరల పెరుగుదలను నియంత్రించాలి..

సరకులు సరఫరా చేసే ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తితే ధరల పెరుగుదలకు దారితీస్తుందన్నారు సోనియా గాంధీ. అలాంటి సమస్యలు రాకుండా చూడాలని కోరారు. కేంద్రం వద్ద నిల్వలో ఉన్న ఆహార పదార్థాలను రాష్ట్రాలకు విరివిగా అందించాలన్నారు. రబీ పంట కోతలు మొదలవుతున్న నేపథ్యంలో.. జాతీయ ఆహార సంస్థ మరింత నిల్వ సామర్థ్యం పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇదీ చూడండి: ఎన్నికల కమిషనర్ల​ జీతాల్లో 30 శాతం కోత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.