ETV Bharat / bharat

ఎన్నికల కమిషనర్ల​ జీతాల్లో 30 శాతం కోత - election commissioner Sushil Chandra

కరోనాపై పోరాటానికి ప్రధాన ఎన్నికల కమిషనర్​, ఎన్నికల కమిషనర్లు తమ వంతు ఆర్థిక సాయం అందించేందుకు ముదుకొచ్చారు. ఏప్రిల్​ 1 నుంచి ఒక ఏడాది పాటు జీతాల్లో 30శాతం స్వచ్ఛందంగా కోత విధించుకున్నారు.

CEC, fellow commissioners take 30 pc cut salary cut to fund COVID-19 fight
కేంద్ర ఎన్నికల కమిషనర్ల​ జీతాల్లో 30శాతం కోత
author img

By

Published : Apr 13, 2020, 5:13 PM IST

దేశాన్ని కరోనా కలవర పెడుతోంది. వైరస్​పై పోరాటానికి ఇప్పటికే పలువురు విరాళాలు ప్రకటించారు. కొంతమంది అధికారులు నెలజీతాలు విరాళంగా ఇచ్చారు. తాజాగా ప్రధాన ఎన్నికల కమిషన్​ సునీల్​ అరోడా, ఎన్నికల కమిషనర్లు అశోక్​ లవాసా, సుశీల్​ చంద్ర కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనాపై పోరాటానికి నిధులు సమకూర్చడానికి ఏప్రిల్​ 1నుంచి నెల జీతాల్లో ఏడాది పాటు స్వచ్ఛందంగా కోత విధించుకుంటున్నట్లు ప్రకటించారు.

వారి జీతమెంత?

భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం ప్రధాన ఎన్నికల కమిషనర్​(సీఈసీ) సహా ముగ్గురు కమిషనర్ల నెల జీతాలు.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వేతనానికి సమానంగా ఉంటాయి. ప్రస్తుతం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి నెలకు రూ.2.50లక్షల జీతం అందుతుంది.

ఇటీవల ఎంపీలూ వారి జీతాల్లో కోత విధించుకున్నట్లు ప్రకటించారు.

ఇదీ చూడండి: ప్రపంచదేశాలకు భారత్​ 'సంజీవని'గా ఎలా మారింది?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.