ETV Bharat / bharat

దాడి చేసిన కొద్ది గంటల్లోనే ఇద్దరు ముష్కరులు హతం - Militants killed in encounter

జమ్ముకశ్మీర్​ బారముల్లాలో సీఆర్​పీఎఫ్​, పోలీసు బలగాలే లక్ష్యంగా దాడికి పాల్పడిన ఉగ్రమూకల్లో ఇద్దరిని మట్టుబెట్టాయి బలగాలు. దాడి జరిగిన కొన్ని గంటల్లోనే ప్రతీకారం తీర్చుకున్నాయి. ఉగ్రమూకలు నక్కి ఉన్న ప్రాంతాన్ని గుర్తించి హతమార్చాయి. మిగతా వారి కోసం గాలింపు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. లష్కరే తోయిబా ఈ దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.

Militants killed in encounter
బారముల్లా దాడికి ప్రతీకారం
author img

By

Published : Aug 17, 2020, 8:05 PM IST

జమ్ముకశ్మీర్​ బారముల్లాలో సీఆర్​పీఎఫ్​ జవాన్లు, పోలీసులే లక్ష్యంగా దాడికి పాల్పడిన ఉగ్రమూకలపై ప్రతీకారం తీర్చుకున్నాయి భద్రతా దళాలు. ఇద్దరు సీఆర్​పీఎఫ్​ జవాన్లు, ఓ పోలీసు అధికారి వీరమరణానికి కారణమైన వారిపై ఉక్కుపాదం మోపాయి. దాడి జరిగిన కొన్ని గంటల్లోనే ఉగ్రమూకలను గుర్తించి.. ఇద్దరిని హతమార్చాయి.

బారాముల్లాలో తనిఖీలు నిర్వహిస్తున్న సీఆర్​పీఎఫ్​, స్థానిక పోలీసులపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు సీఆర్​పీఎఫ్​ జవాన్లు, ఓ స్థానిక పోలీసు అధికారి వీరమణం పొందారు. దాడి జరిగిన వెంటనే భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. సమీప ప్రాంతాలను జల్లెడపట్టాయి. ఈ క్రమంలో క్రీరి ప్రాంతంలో ఉగ్రమూకలు నక్కిఉన్నట్లు గుర్తించి చుట్టుముట్టారు జవాన్లు. ఇరువురి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. బలగాల కాల్పుల్లో​ ఇద్దరు ముష్కరులు హతమయ్యారు.

మృతి చెందిన ఉగ్రవాదులు.. లష్కరే తోయిబా (ఎల్​ఈటీ)కి చెందిన వారిగా అనుమానిస్తున్నారు అధికారులు. ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతున్నట్లు తెలిపారు కశ్మీర్​ ఐజీపీ విజయ్​ కుమార్​. బారముల్లా దాడిలో ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు పాల్గొన్నట్లు భావిస్తున్నట్లు చెప్పారు.

" స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ముగ్గురు ఉగ్రవాదులు జవాన్లపై కాల్పులకు పాల్పడ్డారు. లష్కరే తోయిబా ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. త్వరలోనే వారికి దీటైన సమాధానం చెబుతాం. తనిఖీలు కొనసాగుతున్నాయి. త్వరలోనే అందరిని మట్టుబెడతామనే నమ్మకం ఉంది.

- విజయ్​ కుమార్​, కశ్మీర్​ ఐజీపీ

ఉగ్రవాదులు తమ వ్యూహాలను మార్చుకుని భద్రతా దళాలపై దాడి చేసి పారిపోతున్నారా? అని అడిగిన ప్రశ్నకు..ఈ విధంగా చేయటం ఆందోళన కలిగించే విషయమన్నారు ఐజీపీ. అయితే.. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు.

ఇదీ చూడండి: కాంగ్రెస్​లో '100 లేఖల' దుమారం- ఏది నిజం?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.