ETV Bharat / bharat

వెండింగ్​ మెషిన్​ దోచేసిన కూలీలు.. వీడియో వైరల్​

మధ్యప్రదేశ్​లోని ఓ రైల్వే స్టేషన్​లో వలస కూలీలు తమ ఆకలి తీర్చుకోవడానికి వెండింగ్​ మెషిన్​ను లూటీ చేశారు. దొరికింది దొరికినట్టు దోచుకెళ్లారు. ప్రస్తుతం ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్​ అయింది.

food vending machine viral video
వెండింగ్​ మెషీన్​లో 'ఫుడ్​' దోచుకెళ్లిన కూలీలు.. వీడియో వైరల్​
author img

By

Published : May 16, 2020, 10:34 PM IST

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కారణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వలసకార్మికులను వారి స్వస్థలాలకు తరలించేందుకు భారతీయ రైల్వే.. శ్రామిక్‌ రైళ్లను నడుపుతోంది. ముంబయి నుంచి ధన్​పుర్​ వెళ్తున్న ఓ రైలులోని కూలీలు.. రైలు ఆగిన సమయంలో స్టేషన్​లో ఉన్న వెండింగ్​ మెషిన్​ను లూటీ చేశారు. ఆహారం, శీతలపానియాలను దోచుకెళ్లారు. ఓ ప్రయాణికుడు తీసిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని జబల్​పుర్​ స్టేషన్​లో శుక్రవారం జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై నెటిజన్లు మిశ్రమ స్పందన తెలిపారు. రైల్వే ఆహార సదుపాయాలు ఇవ్వకపోవడం వల్లే కూలీలు ఇలా చేశారంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే సంఘటనపై స్పందించిన పశ్చిమ సెంట్రల్​ రైల్వే అధికారులు మాత్రం.. తాము నీళ్లు, ఆహారం సరఫరా చేసినట్లు తెలిపారు.

వెండింగ్​ మెషిన్​లో 'ఫుడ్​' దోచుకెళ్లిన కూలీలు

14 లక్షల మంది తరలింపు..

మే 15 నాటికి దేశవ్యాప్తంగా 1074 శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లను నడిపినట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. వీటి ద్వారా 14 లక్షల మంది వలస కార్మికులను వారి సొంత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించింది. గత 3 రోజులుగా ప్రతిరోజు సరాసరి 2 లక్షల మందిని వారి స్వస్థలాలకు చేరుస్తున్నట్లు పేర్కొంది.

దిల్లీ నుంచి ఇతర ప్రధాన నగరాలకు 15 ప్రత్యేక రైళ్లను భారతీయ రైల్వే ప్రారంభించింది. ఇవి మే 12 నుంచి ప్రారంభం అయ్యాయి. జూన్‌ 30 వరకు సాధారణ ప్రయాణికుల రైళ్ల రిజర్వేషన్లు రద్దు చేసింది. వీటికి సంబంధించిన టికెట్‌ డబ్బులను త్వరలోనే ప్రయాణికులకు తిరిగి చెల్లిస్తామని స్పష్టం చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.