కరోనా సంక్షోభం నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ ఎంతో మంది జీవితాలను దుర్భర పరిస్థితుల్లోకి నెట్టేసింది. ముఖ్యంగా వలస కూలీల పరిస్థితి దారుణంగా తయారైంది. దేశవ్యాప్తంగా రవాణా సౌకర్యాలు నిలిచిపోవడం వల్ల వేలాది మంది వలసజీవులు తామున్న చోట పనుల్లేక స్వగ్రామాల బాటపట్టారు. అలాంటి వారికి ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినా అంతకుముందే ఎంతో మంది కాలిబాటన వందల కిలోమీటర్లు ప్రయాణించారు. ఈ నేపథ్యంలో పలువురు ప్రమాదాలకు గురవ్వగా మరికొందరు ఆస్పత్రుల పాలయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లోనే మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వలసకూలీ హైదరాబాద్‌లో నివసిస్తూ.. నిండు గర్భిణి అయిన తన భార్య, రెండేళ్ల పాపతో కలిసి స్వస్థలానికి బయలుదేరాడు. ఆయన ప్రయాణం ఎలా సాగిందో మీరే చూడండి.
తోపుడు బండిపై భార్య, కూతురును కూర్చోబెట్టి..
మధ్యప్రదేశ్‌లోని బాలాకోట్‌కు చెందిన రాము, తన భార్య ధన్వంత (8 నెలల గర్భిణి), రెండేళ్ల కూతురు అనురాగిణితో స్వస్థలానికి పయనమయ్యాడు. అంతదూరం తన భార్య నడిచివెళ్లాలంటే ప్రమాదమని భావించి మార్గమధ్యలో చేతికి దొరికిన కట్టెలు, అట్టముక్కలతో తోపుడు బండిని తయారు చేశాడు. దానిపై భార్య, కూతుర్ని కూర్చోబెట్టిన రాము వందల కిలోమీటర్లు వారిని తీసుకెళ్లాడు. తినడానికి తిండి లేకున్నా అలాగే తన ప్రయాణం కొనసాగించాడు. రోడ్డున పోయే ఒకరు ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడం వల్ల విషయం వెలుగులోకి వచ్చింది.
-
बालाघाट का एक #मजदूर जो कि हैदराबाद में नौकरी करता था 800 किलोमीटर दूर से एक हाथ से बनी लकड़ी की गाड़ी में बैठा कर अपनी 8 माह की गर्भवती पत्नी के साथ अपनी 2 साल की बेटी को लेकर गाड़ी खींचता हुआ बालाघाट पहुंच गया @ndtvindia @ndtv #modispeech #selfreliant #Covid_19 pic.twitter.com/0mGvMmsWul
— Anurag Dwary (@Anurag_Dwary) May 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">बालाघाट का एक #मजदूर जो कि हैदराबाद में नौकरी करता था 800 किलोमीटर दूर से एक हाथ से बनी लकड़ी की गाड़ी में बैठा कर अपनी 8 माह की गर्भवती पत्नी के साथ अपनी 2 साल की बेटी को लेकर गाड़ी खींचता हुआ बालाघाट पहुंच गया @ndtvindia @ndtv #modispeech #selfreliant #Covid_19 pic.twitter.com/0mGvMmsWul
— Anurag Dwary (@Anurag_Dwary) May 13, 2020बालाघाट का एक #मजदूर जो कि हैदराबाद में नौकरी करता था 800 किलोमीटर दूर से एक हाथ से बनी लकड़ी की गाड़ी में बैठा कर अपनी 8 माह की गर्भवती पत्नी के साथ अपनी 2 साल की बेटी को लेकर गाड़ी खींचता हुआ बालाघाट पहुंच गया @ndtvindia @ndtv #modispeech #selfreliant #Covid_19 pic.twitter.com/0mGvMmsWul
— Anurag Dwary (@Anurag_Dwary) May 13, 2020
"తొలుత నా కూతుర్ని ఎత్తుకొని వెళ్లాలని నిర్ణయించుకున్నా. కానీ అన్ని కిలోమీటర్లు నడిచివెళ్లాలంటే కష్టం. పైగా నా భార్య నిండు గర్భిణి. దాంతో మార్గమధ్యలో దొరికిన కట్టెలు, అట్టముక్కలతో తోపుడు బండిని తయారు చేసి, వారిద్దర్నీ దానిపై కూర్చోబెట్టి లాక్కుంటూ ముందుకెళ్లా." - రాము, వలస కార్మికుడు
మార్గంమధ్యలో మహారాష్ట్ర పోలీసులు వీరి దయనీయ పరిస్థితిని చూసి సహాయం చేశారు. నితేశ్ భార్గవ అనే పోలీస్ అధికారి వారికి ఆహారం అందించి, వైద్య పరీక్షలు చేయించారు. తర్వాత వారికి ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి స్వస్థలానికి తరలించారు.
ఇదీ చూడండి: రెండోరోజు 'ఉద్దీపన'లపై కోటి ఆశలు!