ETV Bharat / bharat

రైతుల నిరసన ప్రాంతాల్లో అంతర్జాల​ సేవలు బంద్!​​ - కేంద్ర హోంమంత్రిత్వ శాఖ

రైతుల ఆందోళనలకు కేంద్ర బిందువుగా భావిస్తున్న సింఘు, టిక్రీ, ఘాజీపుర్​ సరిహద్దుల్లో అంతర్జాల సేవలు తాత్కాలికంగా నిలిపేస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

MHA orders suspension of internet at 3 border protest sites
దిల్లీ సరిహద్దుల్లో ఇంటర్​నెట్​ సేవలు బంద్​
author img

By

Published : Jan 30, 2021, 3:46 PM IST

దిల్లీ సరిహద్దు ప్రాంతాలైన సింఘు, టిక్రీ, ఘాజీపుర్​లలో ఇంటర్​నెట్​ సేవలను తాత్కాలికంగా నిలిపేసింది కేంద్రం. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ మూడు సరిహద్దులతో పాటు.. దిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ జనవరి 29 రాత్రి 11 గంటల నుంచి జనవరి 31 రాత్రి 11గంటల వరకు ఇంటర్​నెట్​ సేవలపై నిషేధం కొనసాగుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు.. అత్యవసర పరిస్థితిని తప్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాయి.

రైతుల ట్రాక్టర్​ ర్యాలీ సందర్భంగా హింసాత్మక ఘటనలతో జనవరి 26 సైతం.. దిల్లీలో కొన్ని ప్రాంతాల్లో తాత్కాలికంగా ఇంటర్​నెట్​ సేవలను నిలిపేసింది ప్రభుత్వం.

ఇదీ చదవండి: ఘాజీపుర్​ సరిహద్దుకు పోటెత్తిన అన్నదాతలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.