దేశంలో పలు ప్రాంతాల్లోని వలస కార్మికులు తమ స్వస్థలాలకు చేరడానికి ఎలాంటి ప్రమాదాలను లెక్క చేయడంలేదు. కాలినడకనే రైల్వే ట్రాక్లు, రహదారుల వెంబడి వందల కిలోమీటర్ల కొద్దీ ప్రయాణం సాగిస్తున్నారు. వారిని గుర్తించి ఉచిత వసతి, భోజన సౌకర్యాలు కల్పించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ.
చొరవ తీసుకోండి.
కేంద్ర ప్రభుత్వం వలస కార్మికుల కోసం శ్రామిక్ రైళ్లు, బస్సులను ఏర్పాటు చేసినప్పటికీ కొందరు ఇంకా నడక సాగిస్తున్నారు. అలాంటి వారిని రైళ్లు, బస్సుల్లో తరలించాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు సూచించారు హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా. సొంత రాష్ట్రాలకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్న వలస కార్మికులకు కావాల్సిన ఏర్పాట్లు చేయడంలో రాష్ట్రాలు కూడా బాధ్యత వహించాలన్నారు.
ఇదీ చూడండి: రిక్షా బాలుడు: తల్లీదండ్రుల భారాన్ని.. వందల కి.మీ మోస్తూ..