ETV Bharat / bharat

'వైద్య సిబ్బందికి పటిష్ఠ భద్రత కల్పించండి' - కోవిడ్- 19 వార్తలు

వైద్యులు, ఆరోగ్య సిబ్బందిపై దాడులు జరగకుండా పటిష్ఠ భద్రత కల్పించాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశించింది. భద్రతను పర్యవేక్షించేందుకు జిల్లా, రాష్ట్ర స్థాయిలో నోడల్​ అధికారులను నియమించాలని సూచించింది.

VIRUS-MHA-DOCTORS
కేంద్ర హోంశాఖ
author img

By

Published : Apr 22, 2020, 5:56 PM IST

వైద్య, ఆరోగ్య సిబ్బందికి కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం. కరోనా సంక్షోభం కారణంగా వైద్యులు, ఆరోగ్య సిబ్బందిపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఈ సూచన చేసింది కేంద్రం.

ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, యూటీల ముఖ్య కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్​ భల్లా లేఖ రాశారు. ఈ సందర్భంగా ప్రజల విచ్చలవిడి ప్రవర్తనతో వైద్య సిబ్బంది, వారి కుటుంబాలపై జరిగిన దాడులు, సంభవించిన మరణాలను ఆ లేఖలో ప్రస్తావించారు.

"ఈ సంక్షోభ సమయంలో వైద్యులకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య సిబ్బందిపై దాడులు చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. బాధితులకు చికిత్స చేస్తూ కరోనా బారినపడి మరణించిన వైద్యులు, ఆరోగ్య సిబ్బంది అంత్యక్రియలను అడ్డుకున్న వారిని తక్షణమే శిక్షించాలి."

- అజయ్ భల్లా, కేంద్ర హోంశాఖ కార్యదర్శి

వైద్య సిబ్బంది భద్రతను పర్యవేక్షించేందుకు జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో నోడల్ అధికారులను ఏర్పాటు చేయాలని సూచించారు భల్లా. భద్రత 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టలన్నారు. ఏదైనా హింసాత్మక ఘటనలు చెలరేగితే తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

ఇదీ చూడండి: ఆరోగ్య సిబ్బంది రక్షణకై కేంద్రం ప్రత్యేక ఆర్డినెన్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.