జెండాలో విత్తనాలు
చెట్లతో తయారు చేసిన ఈ మువ్వన్నెల జెండాకు ఓ ప్రత్యేకత ఉంది. జెండా రూపకల్పన చేసే సమయంలో రకరకాల కూరగాయలు, పండ్ల విత్తనాలను అందులో ఉంచుతారు. స్వాతంత్ర్య దినోత్సవం అయిపోయాక వీటిని మట్టిలో వేస్తే కొద్దిరోజులకు మొక్కై ఎదుగుతుంది. ఒక్కో జెండాలో 7 వరకు విత్తనాలు ఉంటాయి. అందులో మెక్సికన్ మారిగోల్డ్, బొప్పాయి, గ్లాడిరియా, సిలోసియా వంటి విత్తనాలు ఉన్నాయి. అవి రెండు మూడు నెలల్లో మొక్కలుగా రూపాంతరం చెందుతాయి. జెండాలను నీటిలో వేసి కొద్ది సమయం ఉంచితే విత్తనాలు, పేపర్ వేరవుతాయి. అప్పుడు ఆ విత్తనాలను నాటాల్సి ఉంటుంది.
వీటి ద్వారా ప్లాస్టిక్ జెండాలను తగ్గించటమే కాకుండా చిన్నారుల్లో పర్యావరణంపై చైతన్యం కలుగుతుందన్నారు ఇన్నర్వీల్ క్లబ్ మాజీ అధ్యక్షురాలు లక్ష్మీశివకుమార్. తెలిసోతెలియకో జెండాను అవమానించే విధానానికి తెరపడుతుందన్నారు.
" పూలతో పాఠశాల అందంగా తయారవుతుంది. పాఠశాల ఆవరణలో జెండాలోని విత్తనాలను నాటటం ద్వారా చిన్నారుల్లో పర్యావరణపై చైనత్యం పెంపొందుతుంది."
- లక్ష్మీశివకుమార్, ఇన్నర్వీల్ క్లబ్ మాజీ అధ్యక్షురాలు
ఇదీ చూడండి: 'పరిస్థితులను బట్టే అణ్వస్త్రాల వినియోగంపై నిర్ణయాలు'