ETV Bharat / bharat

విభేదాల మధ్య కాంగ్రెస్​ సంస్థాగత కమిటీ​ భేటీ - కాంగ్రెస్​ తాజా వార్తలు

కాంగ్రెస్​లో సంస్థాగత విషయాలపై చర్చించేందుకు ఆ పార్టీ ప్యానెల్​ సమావేశం నిర్వహించింది. పార్టీ ప్రస్తుత పరిస్థితులు, కశ్మీర్​లో జరగబోయే డీడీసీ ఎన్నికలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించుకున్నట్టు తెలుస్తోంది.

Members of Congress panel set up to advise Sonia discuss organisational matters
కాంగ్రెస్​ సంస్థాగత అంశాల చర్చపై ప్యానెల్​ సభ్యుల భేటీ
author img

By

Published : Nov 18, 2020, 6:10 AM IST

కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీకి.. పార్టీకి సంబంధించిన కీలక అంశాలపై సలహాలిచ్చేందుకు ఏర్పాటు చేసిన​ సంస్థాగత కమిటీ తొలిసారి సమావేశమైంది. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ప్యానెల్​ భేటీలో.. సంస్థాగత అంశాలపై ప్యానెల్​ సభ్యులు చర్చించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. బిహార్​ ఎన్నికల ఫలితాలు, కశ్మీర్​లో జరగబోయే జిల్లా అభివృద్ధి మండలి(డీడీసీ) ఎన్నికలు సహా.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపైనా వీరు సమాలోచనలు జరిపినట్టు తెలుస్తోంది.

పార్టీ ప్రక్షాళన కోరుతూ గతంలో 23మంది కాంగ్రెస్​ నాయకుల బృందం.. సోనియాకు లేఖ రాసిన అనంతరం పార్టీ పునర్​వ్యవస్థీకరణ జరిగింది. ఆ తర్వాత ప్యానెల్​ సభ్యులు(ఆరుగురు) సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి. అనారోగ్యం కారణంగా సోనియా గాంధీ, సీనియర్​ నాయకుడు అహ్మద్​ పటేల్​ ఈ సమావేశానికి హాజరుకాలేకపోయారు.

బిహార్​లో కాంగ్రెస్​ ఘోర పరాభవంపై ఆ పార్టీ మౌనం వహించడాన్ని సీనియర్​ నాయకుడు కపిల్​ సిబల్​ అధిష్ఠానాన్ని ప్రశ్నించిన రెండురోజుల్లోపే.. ఈ భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చదవండి: అయోధ్య దీపోత్సవ ధగధగలకు గిన్నిస్​ అభినందనలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.