జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాను పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి గృహనిర్బంధంలో ఉన్న వీరివురితో పాటు రాష్ట్రంలోని మరికొంతమంది కీలక నేతలను అదుపులోకి తీసుకున్నారు.
ముఫ్తీని హరినివాస్ అతిథి గృహానికి తరలించినట్లు సమాచారం. దేశంలో ఇదొక చీకటి దినమని ముఫ్తీ వ్యాఖ్యానించారు.
కశ్మీర్లో ఆదివారం అర్ధరాత్రి నుంచి నిరవధిక కర్ఫ్యూ విధించింది ప్రభుత్వం. కీలక నేతలను గృహ నిర్బంధంలో పెట్టింది. మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్రవ్యాప్తంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది హోంశాఖ.
ఇదీ చూడండి: కశ్మీర్ డైరీ: 70 ఏళ్ల సమస్య- ఒక్క రోజులో చకచకా