ETV Bharat / bharat

'ప్రజాస్వామ్యం బలోపేతంలో మీడియా పాత్ర కీలకం' - జాతీయ పత్రికా దినోత్సవం రామ్​నాథ్ కోవింద్

జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ప్రెస్ కౌన్సిల్ ఆప్ ఇండియా నిర్వహించిన వర్చువల్ సమావేశానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి తమ సందేశాలు అందించారు. కొవిడ్​ సమయంలో ప్రజలకు అవగాహన కల్పించడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు.

press day
'ప్రజాస్వామ్య నైతికతకు మీడియానే బలం'
author img

By

Published : Nov 16, 2020, 3:38 PM IST

కొవిడ్​పై అవగాహన కల్పించడంలో మీడియా అసాధారణమైన సేవలు అందిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. సానుకూల విమర్శలు చేయడం, విజేతల గాథలను ప్రజలకు చేరవేయడం ద్వారా భారత ప్రజాస్వామ్య నైతికతకు మీడియా బలం చేకూరుస్తోందని ప్రశంసించారు. ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేయడంలో మీడియా కీలకంగా వ్యవహరిస్తోందని అన్నారు. జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి లిఖితపూర్వకంగా తన సందేశాన్ని అందించారు.

"అవగాహన కార్యక్రమాలతో పాటు, సమాజంలో సంస్థాగత మార్పులు తీసుకొచ్చేందుకు మీడియా పోషించిన పాత్రను మనం గుర్తించాం. స్వచ్ఛభారత్, నీటి సంరక్షణ సహా ప్రభుత్వ కార్యక్రమాలకు సహాయపడటాన్ని మనం చూశాం. కొవిడ్ అనంతర పరిస్థితుల్లో దేశం ఆత్మనిర్భర్ భారత్​గా రూపాంతరం చెందుతుంది. ఈ సంకల్పాన్ని ప్రజలకు చేరవేసేలా ప్రచారం చేసేందుకు మీడియా ఉపయోగపడుతుంది."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

కరోనావైరస్ గురంచి ప్రజలకు అవగాహన కల్పించి, వ్యాప్తిని నివారించడంలో మీడియా సిబ్బంది కీలక పాత్ర పోషించారని రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ పేర్కొన్నారు. కరోనా యోధుల్లో ముందువరుసలో ఉన్నారని కొనియాడారు. జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా లిఖితపూర్వక లేఖ విడుదల చేసిన కోవింద్.. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ)ను ప్రశంసించారు.

"'పీసీఐ తన 55 ఏళ్ల అనుభవంలో పత్రికా స్వేచ్ఛను రక్షిస్తూ.. నాణ్యమైన జర్నలిజం కొనసాగేలా కృషి చేసింది. ప్రజాస్వామ్యంలో వీరి పాత్ర కీలకమైనది. కొవిడ్ సంబంధిత సమస్యల విషయంలో మీడియా చాలా కీలక పాత్ర పోషించింది. ప్రజలకు అవగాహన కల్పించి వైరస్ ప్రభావాన్ని తగ్గించేందుకు తోడ్పడింది. కరోనా యోధుల్లో మీడియా సిబ్బంది ముందువరుసలో ఉన్నారు. పీసీఐ ద్వారా వారందరికీ నా తరఫున ప్రశంసలు చెబుతున్నాను."

-రామ్​నాథ్ కోవింద్, రాష్ట్రపతి

పత్రికా స్వేచ్ఛపై జరిగే దాడులు దేశ ప్రయోజనాలకు ప్రమాదకరమని అన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఇలాంటి వాటిని ప్రజలంతా ముక్తకంఠంతో ఖండించాలని పేర్కొన్నారు. స్వేచ్ఛాయుతమైన, నిర్భయమైన పత్రికలు లేకుంటే ప్రజాస్వామ్యం మనుగడ సాధించలేదని అన్నారు. పీసీఐ నిర్వహించిన సమావేశంలో వీడియో ద్వారా సందేశమిచ్చారు.

"ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు, బలపరిచేందుకు భారత్​లో మీడియా ఎల్లప్పుడూ తోడ్పడింది. ప్రజాస్వామ్యాన్ని పటిష్ఠం చేయడానికి, రాజ్యాంగ నియమాలను బలోపేతం చేయడానికి స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఎంత అవసరమో.. బలమైన, స్వేచ్ఛాయుతమైన మీడియా కూడా అంతే ముఖ్యం."

-వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి

అదే సమయంలో వార్తల విషయంలో న్యాయంగా, కచ్చితత్వంతో ఉండాలని మీడియాకు సూచించారు. సంచలనాలు చేసే విధానాన్ని తగ్గించాలని కోరారు. వార్తల్లో తమ అభిప్రాయాలను జోడించడాన్ని నిర్మూలించాలని పేర్కొన్నారు. అభివృద్ధి సంబంధించిన వార్తలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని చెప్పారు.

కరోనా సమయంలోనూ అప్రతిహతంగా వార్తలను సేకరించి ప్రజలకు చేరవేస్తున్న పాత్రికేయులు, సిబ్బందిని ప్రశంసించారు. తప్పుడు వార్తలు అధికంగా ప్రసారమవుతున్న ప్రస్తుత సమయంలో సరైన సమాచారాన్ని సరైన సమయంలో అందించడం చాలా ముఖ్యమని చెప్పారు. ఆధారాలు లేని విషయాల గురించి అవగాహన కల్పించడంలో మీడియాది కీలక పాత్ర అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.