ETV Bharat / bharat

'హాథ్రస్​లో మీడియా, రాజకీయ నేతలకు అనుమతివ్వాలి' - హాథ్రస్​ కేసుపై రాజకీయాలు

హాథ్రస్​లో పోలీసుల తీరు సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో పాటు పార్టీకీ మచ్చ తెచ్చిందని భాజపా సీనియర్ నేత ఉమాభారతి అన్నారు. బాధిత యువతి కుటుంబాన్ని కలుసుకునేందుకు రాజకీయ నాయకులు, మీడియాను అనుమతించాలంటూ యోగి ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు.

uma bharati
ఉమాభారతి
author img

By

Published : Oct 3, 2020, 2:16 PM IST

హాథ్రస్‌ ఘటనలో ఉత్తరప్రదేశ్‌ పోలీసులు ప్రవర్తిస్తోన్న తీరుపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున్న మండిపడుతున్నాయి. తాజాగా సొంత పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి కూడా యూపీ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరు సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో పాటు భాజపాకు కూడా మచ్చ తెచ్చిందని ఆమె అన్నారు. హాథ్రస్‌ ఘటనపై ఉమాభారతి ట్విట్టర్​ వేదికగా స్పందించారు.

"ఓ దళిత కుటుంబానికి చెందిన కుమార్తె ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత పోలీసులు హడావుడిగా ఆమె అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు. ఇప్పుడు ఆమె కుటుంబాన్ని, గ్రామాన్నీ ఎవరితో కలవనీయకుండా చేస్తున్నారు. హాథ్రస్‌ ఘటనలో బాధ్యులపై మీరు తప్పకుండా చర్యలు తీసుకుంటారని భావించి ముందు ఈ విషయాల గురించి నేను ఏమీ మాట్లాడొద్దని అనుకున్నా. కానీ బాధితుల పట్ల పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు బాధాకరంగా ఉంది.

సిట్‌ దర్యాప్తు జరుగుతున్నందున బాధిత కుటుంబం ఎవరితో కలవకూడదనే నిబంధన ఉందా? ఇలాంటి ఘటనల వల్ల సిట్‌ దర్యాప్తుపై కూడా అనుమనాలు తలెత్తుతాయి. రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మనం(భాజపా ప్రభుత్వం) దేశమంతా రామరాజ్యం తీసుకొస్తామని హామీ ఇచ్చాం. కానీ ఇప్పుడు హాథ్రస్‌లో పోలీసులు ప్రవర్తిస్తోన్న తీరు అటు యూపీ ప్రభుత్వంతో పాటు భాజపాకు కూడా మచ్చ తెస్తోంది."

- ఉమాభారతి, భాజపా సీనియర్ నేత

ప్రస్తుతం తాను కరోనా వైరస్‌కు చికిత్స తీసుకుంటున్నానని, లేదంటే ఇప్పటికే బాధిత కుటుంబాన్ని కలిసేదాన్ని అని ఆమె అన్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన తర్వాత వారిని పరామర్శిస్తానని తెలిపారు. ఇప్పటికైనా బాధిత కుటుంబాన్ని కలిసేందుకు రాజకీయనాయకులు, మీడియా వ్యక్తులను అనుమతించాలని యోగి ప్రభుత్వాన్ని కోరారు. "భాజపాలో నేను మీకంటే సీనియర్‌ని. మీకు అక్కలాంటి దాన్ని. నా అభ్యర్థనలు, సూచనలను కొట్టిపారేయొద్దు" అని సీఎం యోగిని కోరారు.

ఇదీ చూడండి: హాథ్రస్​లోకి మీడియాకు అనుమతి- రాజకీయ నేతలకు నో!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.