ETV Bharat / bharat

హాథ్రస్​లోకి మీడియాకు అనుమతి- రాజకీయ నేతలకు నో!

ఉత్తర్​ప్రదేశ్​ హాథ్రస్​లో హత్యాచారానికి గురైన బాధితురాలి కుటుంబాన్ని కలిసేందుకు రాజకీయ నేతలకు అనుమతులు లేవని అధికారులు తెలిపారు. గ్రామంలో సిట్​ దర్యాప్తు పూర్తయిన క్రమంలో ప్రస్తుతానికి మీడియాకు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. 144 సెక్షన్​ అమలులోనే ఉందన్నారు. అయితే.. ఇవాళ రాహుల్​ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్​ ఎంపీలు హాథ్రస్​కు వెళ్లనున్నారు.

Media allowed in Hathras
హాథ్రస్​లోకి మీడియాకు అనుమతి
author img

By

Published : Oct 3, 2020, 1:28 PM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాథ్రస్​ ఘటనపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు బాధిత కుటుంబాన్ని కలిసేందుకు ప్రయత్నించిన క్రమంలో.. రాజకీయ నేతలతో పాటు మీడియాపైనా ఆంక్షలు విధించారు అధికారులు. అయితే గ్రామంలో ప్రస్తుతం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్​) దర్యాప్తు పూర్తయిన క్రమంలో.. మీడియాకు అనుమతులు ఇచ్చినట్లు ఎస్​డీఎం అధికారి ప్రేమ్​ ప్రకాశ్​ మీనా తెలిపారు. కానీ, 144 సెక్షన్​ అమలులోనే ఉంటుందన్నారు. ఐదుగురికన్నా ఎక్కువ మందిని అనుతించేదిలేదన్నారు.

రాజకీయ నాయకులకు అనుమతులుపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ప్రస్తుతానికి కేవలం మీడియాకే ఆంక్షలు సడలించినట్లు చెప్పారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందితే ఇతరులను గ్రామంలోకి పంపుతామన్నారు.

హాథ్రస్​కు యూపీ ఉన్నతాధికారులు..

బాధితురాలి కుటుంబాన్ని కలిసేందుకు హోంశాఖ అదనపు చీఫ్​ సెక్రటరీ, డీజీపీలను హాథ్రాస్​కు పంపించారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​. ఈ మేరకు అక్కడి పరిస్థితులపై సీఎంకు నివేదిక సమర్పించనున్నారని అధికారవర్గాలు తెలిపాయి.

హాథ్రస్​కు మరోమారు కాంగ్రెస్​ ఎంపీలు..

అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని కలిసేందుకు రాహుల్​ గాంధీ నేతృత్వంలో పలువురు కాంగ్రెస్​ ప్రతినిధులు హాథ్రస్​కు వెళ్లనున్నారు. కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా ఈ బృందంలో ఉన్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

అక్టోబర్​ 1న రాహుల్​ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు హాథ్రస్​కు వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ వారిని పోలీసులు అరెస్ట్​ చేసి వెనక్కు పంపించేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు రాహుల్​ గాంధీ. 'హాథ్రస్​హర్రర్'​ హ్యాష్​ట్యాగ్​తో ట్వీట్​ చేసిన ఆయన... బాధిత యువతి, ఆమె కుటుంబం పట్ల యూపీ ప్రభుత్వం, పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు ఆమోదయోగ్యం కాదన్నారు. ఏ ఒక్క భారతీయుడు దానిని అంగీకరించరని పేర్కొన్నారు. ప్రియాంక గాంధీ సైతం యోగి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

ప్రపంచంలో ఏ శక్తీ నన్ను అడ్డుకోలేదు: రాహుల్

ఉత్తర్​ప్రదేశ్​లో అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు రాహుల్​ నేతృత్వంలోని కాంగ్రెస్​ ఎంపీల బృందం హాథ్రస్​కు వెళ్లనున్నట్టు ఆ పార్టీ తెలిపింది. దుఃఖంలో ఉన్న బాధితురాలి కుటుంబసభ్యులకు ఓదార్పు అందించకుండా ప్రపంచంలో ఏ శక్తీ తమను అడ్డుకోలేదని ట్విట్టర్​లో పేర్కొన్నారు రాహుల్​.

ఇదీ చూడండి: అత్యాచార బాధితురాలి ఆత్మహత్య.. పోలీసులే కారణం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.