మానవ హక్కుల సాకుతో చట్టాల ఉల్లంఘనకు పాల్పడితే సహించబోమని స్పష్టం చేసింది భారత్. భారత్లో మానవ హక్కుల కోసం పోరాడే గొంతుకలను ఇటీవల తీసుకొచ్చిన కొన్ని చట్టాలు నొక్కేస్తున్నాయని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హైకమిషనర్ మిషెల్ బాచెలే పేర్కొనటంపై ఈమేరకు స్పందించింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టాన్ని(ఎఫ్సీఆర్ఏ) మరింత కఠినతరం చేయటాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొంది భారత విదేశాంగ శాఖ.
-
Read our statement on comments by UN High Commissioner for Human Rights on an issue related to Foreign Contribution Regulation Act (FCRA). pic.twitter.com/uPsMhktzJt
— Anurag Srivastava (@MEAIndia) October 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Read our statement on comments by UN High Commissioner for Human Rights on an issue related to Foreign Contribution Regulation Act (FCRA). pic.twitter.com/uPsMhktzJt
— Anurag Srivastava (@MEAIndia) October 20, 2020Read our statement on comments by UN High Commissioner for Human Rights on an issue related to Foreign Contribution Regulation Act (FCRA). pic.twitter.com/uPsMhktzJt
— Anurag Srivastava (@MEAIndia) October 20, 2020
" ఎఫ్సీఆర్ఏకు సంబంధించి మానవ హక్కులపై ఐరాస హైకమిషనర్ వ్యాఖ్యలు చూశాం. భారత్.. చట్టాలు, స్వతంత్ర న్యాయవ్యవస్థల ఆధారంగా పాలన సాగిస్తోంది. చట్టాలను రూపొందించటం మా సార్వభౌమ హక్కు. మానవ హక్కుల సాకుతో చట్టాల ఉలంఘనకు పాల్పడితే సహించేది లేదు. "
- భారత విదేశాంగ శాఖ
స్వచ్ఛంద సంస్థలకు విదేశాల నుంచి అందే నిధులకు సంబంధించి భారత్లో అమలవుతున్న ఆంక్షలపై ఆందోళన వ్యక్తం చేశారు ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ మిషెల్ బాచెలే. మానవ హక్కులను పరిరక్షించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: 'పోరాడే గొంతుకలను ఆ చట్టాలు నొక్కేస్తున్నాయి'