ప్రపంచవ్యాప్తంగా దాదాపు మరో 276 మంది భారతీయులు కరోనా బారిన పడ్డట్లు వెల్లడించింది విదేశాంగ శాఖ. ఒక్క ఇరాన్‌లోనే దాదాపు 255 మంది భారతీయులకు ఈ మహమ్మారు సోకినట్లు తాజాగా ధ్రువీకరించింది. వీరితో పాటు యూఏఈలో 12 మంది, ఇటలీలో అయిదుగురు, శ్రీలంక, రువాండా, కువైట్, హాంగ్‌కాంగ్‌లో ఒక్కో భారతీయుడు కరోనా బారిన పడ్డట్లు విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ ప్రకటించారు.
చైనాకు లక్షల మాస్కులు
చైనాకు లక్ష సాధారణ మాస్కులు, మరో లక్ష వైద్య చికిత్స మాస్కులు, 4000 ఎన్-95 మాస్కులతో పాటు ఐదు లక్షల జతల చేతి తొడుగులను ఎగుమతి చేసినట్లు మురళీధరన్ తెలిపారు. భారత వైమానిక దళానికి చెందిన సీ-17 ప్రత్యేక విమానం ద్వారా వీటన్నింటినీ వుహాన్‌కు చేర్చినట్లు స్పష్టం చేశారు. ఇరుదేశాల మధ్య స్నేహానికి గుర్తుగానే వీటిని చైనాకు అందించామన్నారు మురళీధరన్.