ETV Bharat / bharat

విదేశాల్లోని భారతీయులను తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు! - corona virus latest update

కొవిడ్‌-19 విజృంభణ నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై కేంద్రం పరిశీలిస్తోంది. విదేశీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో ఆయా దేశాల్లోని దౌత్యకార్యాలయాల వారీగా చిక్కుకుపోయిన వారిని గణిస్తోంది. వారం, పది రోజుల్లో ఈ విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

mea
విదేశాల్లోని భారతీయులు
author img

By

Published : Apr 15, 2020, 8:28 AM IST

విద్య, ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు వెళ్లిన భారతీయులు.. ప్రపంచవ్యాప్తంగా 1.75 కోట్ల మంది ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. 2019 సెప్టెంబర్​లో డిపార్టమెంట్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ సోషియల్‌ ఎఫైర్స్‌ (డీఈఎస్‌ఏ) ఈ గణాంకాలను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ సంఖ్య మరింత పెరిగి రెండు కోట్లకు చేరి ఉంటుందని విశ్లేషకుల అంచనా.

కరోనా సంక్షోభం కారణంగా వివిధ దేశాల్లో ఉన్న భారతీయులు స్వదేశానికి రావడానికి అధిక సంఖ్యలో మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే పలు దేశాల్లో ఉన్న భారతీయులు ఆయా దేశాల్లోని దౌత్యకార్యాలయాలను సంప్రదించి తమను భారత్‌కు పంపాలని అభ్యర్థిస్తున్నారు.

వైద్య సదుపాయల లేమి..

అంతేకాకుండా.. కరోనా పరీక్షలు పూర్తి స్థాయిలో చేసేందుకు చాలా దేశాలకు తగిన శక్తి సామర్థ్యాలు లేవు. ఇప్పటికే కువైట్‌కు భారత్‌ దేశం నుంచి వైద్యులు, నర్సులను తరలించి కరోనా పరీక్షలు చేయిస్తుండగా మరికొన్ని దేశాలు కూడా భారత్‌ సాయం కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో విదేశాల్లోని భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలను కేంద్రం మొదలు పెట్టింది.

ఎక్కడెక్కడ ఎంతమంది..

ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్య, ఉపాధి, విజిట్, పర్యటక వీసాలపై వెళ్లిన వారి వివరాలను ఆయా దేశాల్లోని దౌత్య కార్యాలయాల ద్వారా సేకరిస్తోంది భారత్. ఇవి కాకుండా ఆయా దేశాల్లో స్థిరపడి, అక్కడి పౌరసత్వం పొందినవారు... కరోనా నేపథ్యంలో స్వదేశానికి వస్తామని అభ్యర్థిస్తున్నవారి గురించి ఆరా తీస్తోంది. రకరకాల అవసరాల కోసం వివిధ దేశాలకు వెళ్లిన వారు ఎంత మంది ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని దేశాల్లోని వారిని తీసుకురావాలా? కొవిడ్- 19 తీవ్రతను బట్టి, స్థానిక పరిస్థితులను బట్టి ఏయే దేశాల నుంచి తరలించాలన్న అంశాలపై కేంద్రం తీవ్రంగా పరిశీలిస్తోంది.

గల్ఫ్ దేశాల్లో..

అయితే భారత్​ నుంచి పొట్ట చేతపట్టుకుని ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన కార్మికులు 60- 80లక్షల వరకు ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో అధిక సంఖ్యలో కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారున్నారు. స్వదేశానికి తరలించే విషయంలో గల్ఫ్‌ దేశాల్లోని కార్మికులకు మొదటి ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది.

వారికి ఉపాధి ఎలా?

అంత పెద్ద సంఖ్యలో గల్ఫ్‌ దేశాల నుంచి స్వదేశానికి వచ్చే వారికి ముందు అక్కడ పరీక్షలు చేయాల్సి వస్తుంది. అక్కడ నుంచి భారత్‌కు వచ్చిన వెంటనే వారందరిని క్వారంటైన్‌లో ఉంచి ఆ తరువాతనే స్వస్థలాలకు పంపాల్సి ఉంటుంది. అంతేకాకుండా వారంతా కూడా జీవనోపాధి కోసం వెళ్లినవారు కావటం వల్ల ఇక్కడికి వచ్చిన తరువాత వారికి ఏలాంటి ఉపాధి కల్పించాలి?, వారిని ఎలా ఆదుకోవాలి? తదితర అంశాలపై కేంద్ర విదేశాంగ శాఖ పరిశీలన చేస్తోంది.

వైరస్ సోకలేదనుకుంటేనే..

వివిధ దేశాల నుంచి వచ్చే వారికి కరోనా వైరస్‌ పరీక్షలు నిర్వహించి పాజిటివ్‌ లేదని నిర్ధరించుకున్న తరువాతనే తీసుకురావడం సురక్షితమని అధికారులు భావిస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో బయట దేశాల్లోని దాదాపు రెండు కోట్ల మంది భారతీయులను తరలించడంపై సాధ్యాసాధ్యాలపై లోతైన పరిశీలన జరుగుతోంది. వారం, పది రోజుల్లో ఈ అంశంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: లాక్​డౌన్​ పొడిగింపుపై డబ్ల్యూహెచ్​ఓ ప్రశంసలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.